Telusu Kada First Review: ‘తెలుసు కదా’ ఫస్ట్ రివ్యూ.. సిద్ధు హిట్టు కొట్టి ఫామ్లోకి వచ్చినట్టేనా?

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా తెరకెక్కిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ ‘తెలుసు కదా’. కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన ఈ చిత్రంతో డైరెక్టర్ గా మారుతుంది. ‘మల్లికా గంధ’ అనే పాట చార్ట్ బస్టర్ గా నిలిచింది. సినిమాకి కొంత పబ్లిసిటీ తీసుకొచ్చింది. టీజర్ కథపై పెద్దగా క్లారిటీ ఇవ్వలేదు. ట్రైలర్లో కొంతవరకు కథ ఓపెన్ చేశారు కానీ మెయిన్ పాయింట్ ఏంటన్నది రివీల్ చేయలేదు. కేవలం సిద్ధు జొన్నలగడ్డకి ఉన్న క్రేజ్ పైనే ఆధారపడి ప్రేక్షకుల ముందుకు వస్తుంది ఈ సినిమా.

Telusu Kada Review

అక్టోబర్ 18 దీపావళి కానుకగా రిలీజ్ కానుంది. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ పై టి.జి.విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆల్రెడీ వారు ఈ సినిమాని ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది సన్నిహితులకు చూపించడం జరిగింది. వారి టాక్ ప్రకారం.. ‘తెలుసు కదా’ సినిమా నిడివి 2 గంటల 16 నిమిషాల నిడివి కలిగి ఉంటుందట.

రిలేషన్షిప్ లో పవర్, కంట్రోల్ నా చేతిలోనే ఉండాలనుకునే ఓ కుర్రాడి జీవితంలో ప్రేమ,పెళ్లి వంటి ఎమోషన్స్ ఎలాంటి జ్ఞాపకాలు మిగిల్చాయి అనేది ఈ సినిమా కథగా తెలుస్తుంది. హీరో ఇద్దరమ్మాయిలని ప్రేమిస్తాడు, ఇద్దరినీ పెళ్లి చేసుకుని కలిసి జీవించాలి అనుకుంటాడు. మధ్యలో ఫెర్టిలిటీ సెంటర్ల చుట్టూ అల్లిన మిగిలిన కథ.

సింపుల్ గా చెప్పాలంటే ‘తెలుసు కదా’ కథ ఇలానే ఉంటుంది. అయితే ట్రయాంగిల్ లవ్ లో మేల్ ఇగో అనేది ఇప్పటి యూత్ కి అమితంగా నచ్చే పాయింట్. దర్శకురాలు నీరజ కోన ఈ పాయింట్ ను చాలా సెన్సిబుల్ గా డీల్ చేసినట్లు తెలుస్తుంది. వైవా హర్ష కామెడీ కూడా సినిమాకు హైలెట్ గా నిలుస్తుందట. క్లైమాక్స్ ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుంది అంటున్నారు.

‘K RAMP’ ఫస్ట్ రివ్యూ.. దీపావళి సెంటిమెంట్ కలిసొచ్చిందా.. !

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus