Acharya Movie: మెగాస్టార్ కు రిలీజ్ డేట్ దొరికిందా..?

  • August 5, 2021 / 03:42 PM IST

మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్ లో ‘ఆచార్య’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా కాలమవుతున్నా.. కరోనా కారణంగా వాయిదా పడింది. నిజానికి మే నెలలోనే ఈ సినిమా విడుదల కావాల్సింది. ఇప్పుడు సరైన రిలీజ్ డేట్ కూడా దొరకడం లేదు. అక్టోబర్ లో సినిమా విడుదల చేయాలనుకున్నారు. అప్పుడేమో ‘ఆర్ఆర్ఆర్ వస్తుంది. క్రిస్మస్, సంక్రాంతి బరిలో చాలా సినిమాలు ఉన్నాయి. మరి ‘ఆచార్య’ పరిస్థితి ఏంటనే విషయంలో క్లారిటీ లేకుండా పోయింది.

అయితే ‘ఆర్ఆర్ఆర్’కు రెండు వారల ముందు దసరా సీజన్ లోనే ‘ఆచార్య’ను విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. అక్టోబర్ 1న లేదా.. సెప్టెంబర్ 30న కానీ ‘ఆచార్య’ను విడుదల చేస్తే రెండు వారాలు సోలోగా కలెక్షన్స్ దండుకోవచ్చు. సెప్టెంబర్ 30న సినిమాను రిలీజ్ చేస్తే అదనపు షోలు కూడా వేసుకోవచ్చని ప్లాన్ చేస్తున్నారు. రెండు వారాల తరువాత ‘ఆర్ఆర్ఆర్’ విడుదలైనా.. నూరు శాతం థియేటర్లలో అయితే రాదు. ఎన్నో కొన్ని థియేటర్లు ‘ఆచార్య’కు కూడా ఉంటాయి. అందుకే ఆ డేట్ ను ఫిక్స్ చేసే ఆలోచన చేస్తుందట చిత్రబృందం. మరి ఏం జరుగుతుందో చూడాలి!

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus