‘టెర్రర్’ ను పట్టించుకుంటే బెటర్….

ట్యాలెంటెడ్ యాక్టర్ శ్రీకాంత్ హీరోగా నటించిన ‘టెర్రర్’ చిత్రం గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రంపై తొలుత పెద్దగా అంచనాలు ఏమీ లేకపోవడంతో పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. క్లుప్తంగా చెప్పాలంటే సినిమాకు పబ్లిసిటీ సైతం సరిగా ఇవ్వనే లేదు. ఇదిలా ఉంటే సినిమా విడుదలయ్యి, మంచి హిట్ టాక్ సంపాదించుకోవడంతో, దీనిపై నిర్మాతలు దృష్టి పెట్టారు. అసలు ఊహించని రెస్పాన్స్ రావడంతో థియేటర్స్ ను పెంచే ఆలోచనలో పడ్డారు. గత శుక్రవారం విడుదలకు నోచుకున్న 7సినిమాల్లో క్షణం తరువాత ఇంకా ప్రదర్శింపబడుతున్న సినిమా ఏమైనా ఉందా అంటే అది ఒక టెర్రర్ మాత్రమే.

ఇక హైదరాబాద్ లో ఇప్పటికే ‘టెర్రర్”కు థియేటర్లు పెంచారు. ఇక మల్టీప్లెక్సుల్లో ఈ మూవీకి థియేటర్స్ పెరిగాయి. కానీ ఇవి చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన శ్రీకాంత్ మరోసారి తన విశ్వరూపం చూపించాడు. సరైన కధ పడాలే కానీ తనలోని నటుణ్ణి నిద్రలేపుతాడు శ్రీకాంత్ అని మరో సారి నిరూపించుకున్నాడు.

ఇక టెర్రరిజం ఆధారంగా చేసుకొని వచ్చిన ఈ సినిమాలో కొత్తకథాంశం కాకపోయినా కథనం కట్టిపడేస్తుంది. కథ ఎక్కడా ప్రక్కదారి పట్టకుండా చక్కటి స్క్రీన్ ప్లేని దర్శకుడు రూపొందించాడు. అయితే సినిమాకు మంచి టాక్ వచ్చినప్పటికీ, పబ్లిసిటీ లేకపోవడం వల్ల పెద్దగా వసూళ్లు రాబట్టలేకపోతుంది. అందుకే ఈ మూవీని ఎంత త్వరగా పబ్లిసిటీ చేసుకుంటే అంత మంచిదని అంటున్నారు సినీ పండితులు. మరి దీనిపై నిర్మాతలు ఏమంటారో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus