TG Vishwa Prasad: 2024లో ఎవరు చూడని నష్టం చూశా: విశ్వప్రసాద్

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి 2024వ సంవత్సరం ఊహించని దెబ్బ కొట్టింది. ప్రొడక్షన్ హౌస్ నుండి వచ్చిన పలు చిత్రాలు భారీగా నిరాశపరిచాయి. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్‌ తో పాటు కమర్షియల్ దర్శకులతో పలు ప్రాజెక్టులు నిర్మిస్తున్న ఈ సంస్థ, ఈ సంవత్సరం బాక్సాఫీస్ వద్ద సరైన విజయాలు అందుకోలేకపోయింది. ‘ఈగల్(Eagle)’, ‘మనమే’(Manamey), ‘మిస్టర్ బచ్చన్’(Mr. Bachchan) , ‘విశ్వం’(Viswam), ‘స్వాగ్’(Swag) , ‘నరుడి బ్రతుకు నటన’ (Narudi Brathuku Natana) వంటి సినిమాలన్నీ కూడా ఆడియన్స్‌ను ఆకట్టుకోలేకపోయాయి.

TG Vishwa Prasad

ఈ సినిమాలు భారీ బడ్జెట్‌తో రూపొందించడం వల్ల, భారీ నష్టాలు ఏర్పడ్డాయని చెప్పాలి. ముఖ్యంగా ‘మనమే’ చిత్రం మేకింగ్ ఖర్చు ఎక్కువవ్వడంతో బాక్సాఫీస్ వద్ద నష్టాలు చూడాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల వలన డిజిటల్ రైట్స్ ద్వారా కొంత నష్టాన్ని కవరుచేసినప్పటికీ, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఈ సంవత్సరం నష్టాలు అనూహ్యమైన రీతిలో పడ్డాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో విశ్వప్రసాద్ (TG Vishwa Prasad) ఈ నష్టాల విషయంపై ఓపికగా స్పందించారు.

ఈ ఏడాది ఎవ్వరూ ఊహించని విధంగా ఎక్కువ నష్టాలు తన సంస్థ ఎదుర్కొందని బహిరంగంగా చెప్పారు. ఇండస్ట్రీలో ఈ ప్రొడక్షన్ హౌస్ బడా నిర్మాణ సంస్థల్లో ఒకటిగా ఉండటంతో, ఈ స్థాయిలో నష్టాలను బహిరంగంగా చెప్పడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ నష్టాల కారణంగా కొన్ని ప్రాజెక్టులను హోల్డ్ లో పెట్టినట్లు విశ్వప్రసాద్ (TG Vishwa Prasad) వెల్లడించారు. కానీ ఈ ఏడాది కష్టాలను అధిగమించి 2025లో మరలా విజయవంతంగా రాణించడానికి తమ సంస్థ సిద్ధమవుతుందని చెప్పారు.

ప్రేక్షకులకు మంచి కంటెంట్ అందించడం, కమర్షియల్ హిట్ చిత్రాలను తలపించే సినిమాలను తీసుకురావడం తన లక్ష్యమని విశ్వప్రసాద్ అభిప్రాయపడ్డారు. 2025లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ‘ది రాజాసాబ్’(The Rajasaab) , తేజ సజ్జా (Teja Sajja) ‘మిరాయ్’ (Mirai) , సిద్ధూ జొన్నలగడ్డ (Siddu Jonnalagadda)  ‘తెలుసు కదా’, అడివి శేష్ (Adivi Sesh) ‘గూఢచారి 2’ (Goodachari 2), ‘మహాకాళి’ వంటి సినిమాలతో రాబోతుంది. అలాగే, సన్నీ డియోల్ (Sunny Deol) హీరోగా గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో రూపొందుతున్న ‘జాట్’ అనే భారీ ప్రాజెక్ట్ మైత్రి మూవీ మేకర్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు.

కుప్పం నుండి పాదయాత్ర చేసుకుంటూ వచ్చిన అభిమానులను కలిసిన ఎన్టీఆర్.. వీడియో వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus