Thaggedele Teaser: ఉత్కంఠ భరితంగా ‘తగ్గేదే లే’ మూవీ టీజర్..!

పదేళ్ల క్రితం కన్నడ నాట సంచలన విజయం సాధించిన సినిమా ’దండుపాళ్యం’.. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి తెలుగు వ్యక్తి శ్రీనివాస రాజు దర్శకుడు. తెలుగు ప్రేక్షకులు ‘దండుపాళ్యం’ చూసి ఇదేం సినిమారా బాబోయ్ అంటూ షాక్ అయ్యారు. మృగాళ్లా మారి మనుషులను హతమార్చడం, కరుడు గట్టిన నేరగాళ్ల చేత నిజాలు చెప్పించడానికి పోలీసులు అంతే కఠినంగా వ్యవహరించడం వంటివి సినిమాలో హైలెట్ గా చూపించారు.

తర్వాత ఈ ఫ్రాంఛైజీలో ‘దండుపాళ్యం 2’, ‘దండుపాళ్యం 3’ సినిమాలు వచ్చాయి. మకరంద్ దేశ్ పాండే, పూజా గాంధీ, రవి కాలే, ‘బొమ్మాళీ’ రవి శంకర్ లాంటి ‘దండుపాళ్యం’ నటీనటులే ప్రధాన పాత్రధారులుగా శ్రీనివాస రాజు డైరెక్ట్ చేసిన సీక్వెల్స్ ఆకట్టుకున్నాయి. తెలుగులో డబ్ చేసి విడుదల చెయ్యగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇప్పుడు ఈ ‘దండుపాళ్యం’ టీమ్ లోకి యంగ్ హీరో నవీన్ చంద్ర కూడా వచ్చి చేరాడు. రవి శంకర్, పూజా గాంధీ, దివ్యా పిళ్లై, అనన్య సేన్ గుప్తా, నైనా గంగూలీ, నాగబాబు, అయ్యప్ప పి శర్మ, రాజా రవీంద్ర కీలకపాత్రల్లో నటించగా.. భద్ర ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి.. ‘పుష్ప’ మూవీలోని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఐకానిక్ డైలాగ్ ‘తగ్గేదే లే’ టైటిల్ ఫిక్స్ చేశారు. రీసెంట్ గా టీజర్ రిలీజ్ చేశారు.

మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కినట్లు అర్థమవుతోంది. థ్రిల్లింగ్ అంశాలతో పాటు రొమాంటిక్ షాట్స్ కూడా చూపించారు. ఈసారి హత్యల నేపథ్యంలో మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించబోతున్నట్లు హింట్ ఇచ్చారు మేకర్స్.. విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ చక్కగా సెట్ అయ్యాయి. టీజర్ చివర్లో రవి శంకర్ చేసిన శబ్దం ‘దండుపాళ్యం’ గ్యాంగ్ లో మకరంద్ దేశ్ పాండేను గుర్తు చేస్తుంది. త్వరలో తెలుగు, కన్నడలో భారీ స్థాయిలో విడుదల కానున్న ‘తగ్గేదే లే’ ఆడియన్స్ ని థ్రిల్ కి గురి చేస్తుందంటున్నాడు దర్శకుడు శ్రీనివాస రాజు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus