జగడం సినిమా ద్వారా కమెడియన్ గా పరిచయమయ్యారు నటుడు తాగుబోతు రమేష్ .ఈ సినిమాలో కమెడియన్ గా అవకాశం అందుకున్నటువంటి ఈయన అనంతరం కెరియర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి రమేష్ ప్రస్తుతం వెండితెర సినిమాలలో నటిస్తూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తున్నారు. నిజానికి ఈయనకు తాగే అలవాటు లేకపోయినా అచ్చం తాగుబోతుల ఎంతో అద్భుతంగా నటిస్తూ తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు.
ఇలా బుల్లి తెర కార్యక్రమాలను చేస్తూనే మరోవైపు వెండితెర సినిమా అవకాశాలను కూడా అందుకొని కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. జబర్దస్త్ కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కూడా సందడి చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో భాగంగా ఈయన తన గతం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తాను నేడు ఈ స్థాయిలో ఉన్నాను అంటే దాని వెనుక ఎన్నో కష్టాలు ఉన్నాయని తెలియజేశారు.
తాను ఇండస్ట్రీలోకి రాకముందు హైదరాబాద్ వచ్చాను. ఇక్కడ లారీ డ్రైవర్ గా ఆటో డ్రైవర్ గా పని చేశానని తెలిపారు. అయితే సినిమా ఇండస్ట్రీ లోకి రావాలనే తన ఇక కోసం ఎంతో కష్టపడ్డానని తెలిపారు. ఇక ఇండస్ట్రీలోకి రావాలి అంటే ఎంతో కష్టమని తెలుసుకున్నటువంటి తాను నైట్ సెక్యూరిటీ జాబ్ చేస్తూ డబ్బు సంపాదించుకునే వాడిని.
ఇలా రాత్రంతా సెక్యూరిటీగా పనిచేస్తూ మరుసటి రోజు ఉదయం నా ఫోటో పట్టుకొని పలు స్టూడియోల చుట్టూ అవకాశాల కోసం తిరిగానని ఈ సందర్భంగా రమేష్ తెలిపారు. ఇలా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి తరుణంలో తనకు జగడం సినిమాలో అవకాశం వచ్చిందని ఈ సందర్భంగా తన సక్సెస్ వెనక ఉన్నటువంటి కష్టాల గురించి (Thagubothu Ramesh) ఈయన మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.