Thalaivii Collections: బ్లాక్ బస్టర్ టాక్ తో కనీసం అర కోటి కూడా కొట్టలేదు..!

ఒకప్పటి స్టార్ హీరోయిన్ అలాగే దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అయిన జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘తలైవి’. బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్… జయలలిత పాత్ర పోషించగా.. ఒకప్పటి స్టార్ హీరో అరవింద్ స్వామి ఎంజీఆర్ పాత్రను పోషించారు.తమిళ దర్శకుడు ఏ.ఎల్.విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. విబ్రి మీడియా, కర్మ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారు. సెప్టెంబర్ 10న వినాయక్ చవితి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేశారు. సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చింది. మరో ‘మహానటి’ అవుతుంది అని అంతా కామెంట్లు చేశారు. కానీ ఆ మూవీ దరిదాపుల్లోకి కూడా ఈ మూవీ రాలేదని రిజల్ట్ ను బట్టి స్పష్టమవుతుంది.ఫస్ట్ వీకెండ్ ఈ చిత్రం కానీసం ఓపెనింగ్స్ ను కూడా రాబట్టలేకపోయింది.

ఆ వివరాలను గమనిస్తే :

నైజాం 0.09 cr
సీడెడ్ 0.06 cr
ఉత్తరాంధ్ర 0.07 cr
ఈస్ట్ 0.04 cr
వెస్ట్ 0.03 cr
గుంటూరు 0.06 cr
కృష్ణా 0.04 cr
నెల్లూరు 0.02 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 0.41 cr

 

తెలుగు రాష్ట్రాల్లో ‘తలైవి’ చిత్రాన్ని ఓన్ రిలీజ్ చేసుకున్నారు నిర్మాతలు. అయినప్పటికీ ఈ చిత్రం క్లీన్ హిట్ గా నిలబడాలి అంటే రూ.1.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. కానీ మొదటి వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం రూ.0.41 కోట్లు షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.1.09 కోట్ల షేర్ ను రాబట్టాలన్న మాట. చూస్తుంటే అది కష్టమే అనిపిస్తుంది.

Click Here For Review

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus