బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేసిన మాస్టర్

  • February 27, 2021 / 06:24 PM IST

బాహుబలి 2 క్రియేట్ చేసిన రికార్డుల గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. దర్శకధీరుడు రాజమౌళి క్రియేట్ చేసిన ఆ విజువల్ వండర్ పాన్ ఇండియా అనే దానికి అసలైన అర్దాన్ని చూపించింది. భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీలో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. అయితే ఆ సినిమా క్రియేట్ చేసిన ఒక రికార్డు ఇప్పుడు బ్రేక్ అయ్యింది. అది కూడా తమిళ్ స్టార్ హీరో ఇళయదలపతి విజయ్ బ్రేక్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

బాహుబలి వరల్డ్ వైడ్ గా 1600కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక కోలీవుడ్ లో కూడా భారీగా రిలీజైన ఈ సినిమా తమిళనాడులో అత్యదిక షేర్స్ అందుకున్న సినిమాగా నిలిచింది. అక్కడే వంద కోట్లకు పైగా షేర్స్ అందించి డిస్ట్రిబ్యూటర్స్ కు కాసుల వర్షాన్ని కురిపించింది. అయితే ఇప్పుడు ఆ సినిమా రికార్డును మాస్టర్ సినిమా బ్రేక్ చేసింది. తమిళ్ లో 100కోట్లకు పైగా షేర్స్ అందుకొని బాహుబలి 2 రికార్డును బద్దలు కొట్టేసింది.

ఈ దెబ్బతో విజయ్ ను తక్కువ అంచనా వేయకూడదని చాలా ఈజీగా అర్ధమయ్యింది. రానున్న రోజుల్లో విజయ్ స్టార్ స్టామినా కూడా పాన్ ఇండియా లెవెల్లో పెరగనున్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ రాబోయే 65వ సినిమాను అన్ని భాషల్లో భారీగా విడుదల చేయాలని ప్లాన్ వేస్తున్నారు. మరి ఆ సినిమా ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి.

Most Recommended Video

చెక్ సినిమా రివ్యూ & రేటింగ్!
అక్షర సినిమా రివ్యూ & రేటింగ్!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus