మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) , అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో రూపొందబోయే చిత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ప్రాజెక్ట్ అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉన్నప్పటికీ, చిరు, అనిల్ కాంబినేషన్‌తో వచ్చే ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ చిత్రానికి తమన్ (S.S.Thaman) సంగీతం అందించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన తమన్, మరోసారి మెగాస్టార్ కోసం మ్యూజికల్ మ్యాజిక్ అందించేందుకు సిద్ధమయ్యారు. ఆమధ్య చిరంజీవి ‘గాడ్‌ఫాదర్’ (God Father) కోసం తమన్ సంగీతం అందించారు.
అయితే ఈ సినిమా మ్యూజిక్ అనుకున్నంత స్థాయిలో క్లిక్కవ్వలేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ, చిరు మళ్ళీ తమన్‌కే ఛాన్స్ ఇవ్వడం వెనుక కారణం అనిల్ రావిపూడి అని తెలుస్తోంది. తమన్‌తో అనిల్ రావిపూడికి మంచి స్నేహం ఉంది, తన సినిమాలకు తమన్ సంగీతం పెద్ద ప్లస్ అవుతుందని అనిల్ నమ్మకం ఉన్నట్లు సమాచారం. అనిల్ రావిపూడి భగవంత్ కేసరి (Bhagavanth Kesari) సినిమాకు థమన్ ఇచ్చిన మ్యూజిల్ ప్లస్ అయ్యింది. అనిల్ రావిపూడి సినిమా అంటే మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయి.
ఈ క్రమంలో తమన్ (Thaman) బాణీలు చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని మేకర్స్ భావిస్తున్నారు. మెగాస్టార్ కెరీర్ లో మంచి మ్యూజికల్ హిట్స్ ఉన్న నేపథ్యంలో ఈసారి తమన్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు సమాచారం. చిరు మాస్ ఇమేజ్‌కు తగిన మాస్ బీట్స్, అలాగే మెలోడియస్ ట్యూన్స్‌ను అందించాలని చూస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తి అయినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం అనిల్ వెంకటేష్ తో (Venkatesh) సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunnam) అనే సినిమాని రెడీ చేస్తున్నాడు. ఇక మెగాస్టార్ విశ్వంభర తో (Vishwambhara) బిజీగా ఉన్నారు. అలాగే శ్రీకాంత్ ఓదెలా (Srikanth Odela) దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయనున్నాడు. ఆ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక అనిల్ సినిమాకు కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ 2025 సమ్మర్ అనంతరం ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లనుంది.