Thamannah: భోళా శంకర్ సమయంలో చిరు అంత బాధ పడ్డారా?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ పనులలో బిజీ అయ్యారు. ఈ ఏడాది మొదట్లో వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్నటువంటి చిరంజీవి తాజాగా మెహర్ రమేష్ దర్శకత్వంలో నటించిన భోళా శంకర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా డైరెక్టర్ మెహర్ రమేష్ నటి (Thamannah) తమన్న ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ జరిగిందంటూ వస్తున్నటువంటి వార్తలపై వీరిని ప్రశ్నించారు.ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే ఆ చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి అమెరికా వెకేషన్ వెళ్తున్నట్టు తెలియజేశారు. అయితే ఈయన వెకేషన్ కోసం కాదని కాలు సర్జరీ కోసం వెళ్లారు అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది.

ఈ విషయం గురించి వీరిని ప్రశ్నించడంతో తమన్నా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.భోళా శంకర్ సినిమాలోని ఒక పాట షూట్ చేస్తున్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి గారు తీవ్రమైన మోకాలి నొప్పి సమస్యతో బాధపడ్డారు. ఇలా నొప్పి తనని బాధిస్తున్న కూడా ఆయన మాత్రం సినిమా షూటింగ్ ఆపాలని చెప్పలేదు. తన నొప్పిని దాచిపెట్టి రిహార్సల్స్ చేస్తూ మరి ఈ పాట షూటింగ్ పూర్తి చేశారు. ఇలా సినిమాల పట్ల ఇంత డెడికేషన్ ఉన్నటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారని ఈమె తెలిపారు.

ఇలా చిరంజీవి మోకాలి నొప్పి గురించి తమన్న ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా తమన్నా ఈ వ్యాఖ్యలు చేయడంతో నిజంగానే చిరంజీవి మోకాలి సర్జరీ కోసమే అమెరికా వెళ్లారా అంటూ అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.ఇక అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్ వచ్చిన తర్వాత చిరంజీవి తాజాగా బేబీ సినిమా వేడుకలో పాల్గొన్న విషయం మనకు తెలిసిందే.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus