Thammudu Collections: నిరాశపరిచిన ‘తమ్ముడు’ ఓపెనింగ్స్!

నితిన్ (Nithiin) హీరోగా వేణు శ్రీరామ్ (Venu Sriram) దర్శకత్వంలో ‘తమ్ముడు’ (Thammudu) వచ్చింది. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత. నితిన్ (Nithiin) కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందింది. నిన్న అంటే జూలై 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా. దీంతో ఓపెనింగ్స్ కూడా నిరాశపరిచాయి.

Thammudu Collections

ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.40 cr
సీడెడ్ 0.12 cr
ఉత్తరాంధ్ర 0.20 cr
ఈస్ట్ 0.04 cr
వెస్ట్ 0.03 cr
గుంటూరు 0.14 cr
కృష్ణా 0.12 cr
నెల్లూరు 0.02 cr
ఏపీ+తెలంగాణ 1.07 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.10 cr
ఓవర్సీస్ 0.35 cr
వరల్డ్ టోటల్ 1.52 cr (షేర్)

‘తమ్ముడు’ (Thammudu) సినిమాకు రూ.22 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.22.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ సినిమాకి రూ.1.52 కోట్ల షేర్ నమోదైంది. గ్రాస్ పరంగా రూ.2.6 కోట్లు కలెక్ట్ చేసింది. నితిన్ గత చిత్రం ‘రాబిన్ హుడ్’ కంటే దారుణమైన ఓపెనింగ్స్ ఇవి. బ్రేక్ ఈవెన్ కోసం ఈ చిత్రం మరో రూ.20.98 కోట్లు షేర్ ను కలెక్ట్ చేయాలి.

హైకోర్టులో స్టార్‌ హీరోకు చుక్కెదురు.. రూ.15 వేల కోట్లు మీకు దక్కవంటూ..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus