Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

నితిన్ (Nithiin) హీరోగా వేణు శ్రీరామ్ (Venu Sriram) దర్శకత్వంలో ‘తమ్ముడు’ (Thammudu) అనే యాక్షన్ మూవీ రూపొందింది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. నితిన్ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందిన సినిమా ఇది. జూలై 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. రిలీజ్ కి ముందు ఈ సినిమాపై కొంచెం బజ్ ఉంది. కానీ రిలీజ్ రోజున మొదటి షోతోనే నెగిటివ్ టాక్ రావడంతో మినిమమ్ ఓపెనింగ్స్ కూడా నమోదు కాలేదు.

Thammudu Collections

దీంతో మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ఈ సినిమా 2వ రోజు మరింత డౌన్ అయ్యింది అని చెప్పాలి. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.66 cr
సీడెడ్ 0.18 cr
ఉత్తరాంధ్ర 0.32 cr
ఈస్ట్ 0.07 cr
వెస్ట్ 0.05 cr
గుంటూరు 0.20 cr
కృష్ణా 0.23 cr
నెల్లూరు 0.04 cr
ఏపీ+తెలంగాణ 1.75 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.18 cr
ఓవర్సీస్ 0.47 cr
వరల్డ్ టోటల్ 2.4 cr (షేర్)

‘తమ్ముడు’ (Thammudu) సినిమాకు రూ.22 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.22.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2 రోజుల్లో ఈ సినిమా రూ.2.4 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.4.1 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం ఈ చిత్రం మరో రూ.20.1 కోట్లు షేర్ ను రాబట్టాలి.

రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

 

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus