వెంకటేష్ (Venkatesh) – త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్లో సినిమా కోసం అభిమానులు మాత్రమే కాదు యావత్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్ రైటింగ్లో వెంకీ చేసిన ‘నువ్వు నాకు నచ్చావ్’ ‘మల్లీశ్వరి’ సినిమాలకి కల్ట్ స్టేటస్ ఉంది. అందుకే త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకీ ఒక సినిమా చేస్తే చూడాలని అంతా ఆశపడ్డారు. త్వరలో అది తీరబోతుంది. ఈ క్రేజీ కాంబోలో ఓ సినిమా రానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు నడుస్తున్నాయి. ‘వెంకటరమణ’ అనే టైటిల్ ను ఈ సినిమా కోసం అనుకుంటున్నారు.
పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రానుంది. వెంకటేష్ ఏజ్..కి ఇమేజ్ కి సెట్ అయ్యే కథతో త్రివిక్రమ్ (Trivikram) సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ఇద్దరి కాంబో అనగానే నాన్ స్టాప్ కామెడీ, పంచ్ డైలాగ్స్ అభిమానులు ఆశిస్తారు. అందుకే త్రివిక్రమ్ స్క్రిప్ట్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తుంది.
ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) ఎంపికైనట్టు టాక్ నడుస్తుంది. కానీ అధికారికంగా టీం ప్రకటించింది లేదు. మరోపక్క త్రిష (Trisha) మెయిన్ హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు టాక్ నడుస్తుంది. వెంకీ – త్రిష..ల కాంబినేషన్లో ‘ఆడవారి మాటలకు అర్దాలే వేరులే’ ‘నమో వెంకటేశ’ ‘బాడీ గార్డ్’ వంటి సినిమాలు వచ్చాయి. అన్నీ హిట్లే.
ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా త్రిష చేసిన ‘అతడు’ పెద్ద హిట్ అయ్యింది. సో ఇది సక్సెస్ ఫుల్ కాంబో అయ్యే అవకాశం ఉంది. సంగీత దర్శకుడిగా మిక్కీ జె మేయర్ ఎంపికయ్యే అవకాశం కనిపిస్తుంది.