విక్రమ్ (Vikram) కి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది.అతను ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘శివపుత్రుడు’ ‘అపరిచితుడు’ ‘ఐ’ వంటి చిత్రాలు తెలుగులో కూడా బాగా ఆడాయి. అయితే ఆ తర్వాత విక్రమ్ నటించిన సినిమాలు వచ్చి వెళ్తున్నాయి తప్ప.. బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేయలేకపోతున్నాయి. అయినప్పటికీ విక్రమ్ ఎఫర్ట్స్ పెట్టడం ఆపలేదు. ప్రతి సినిమాకి తన బెస్ట్ ఇస్తున్నాడు. ఈ ఆగస్టు 15 కి ‘తంగలాన్’ (Thangalaan) తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
‘మైత్రి’ సంస్థ తెలుగులో ఈ సినిమాని రిలీజ్ చేస్తుంది. టీజర్, ట్రైలర్.. సినిమాకి మంచి హైప్ తీసుకొచ్చాయి. అయితే తెలుగులో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో.. ఒకసారి తెలుసుకుందాం రండి :
‘తంగలాన్’ చిత్రానికి రూ.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4.25 కోట్ల షేర్ ను రాబట్టాలి. సినిమాకు పాజిటివ్ టాక్ కనుక వస్తే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదు అంటే ప్రేక్షకులకి ఇంకో 3 సినిమాలు ఆప్షన్స్ గా ఉన్నాయి కాబట్టి.. దీనిని ఇగ్నోర్ చేసే ప్రమాదం ఉంది. 4 రోజులు సెలవులు ఉన్నాయి కాబట్టి.. చియాన్ విక్రమ్ ‘తంగలాన్’ ఏమాత్రం మెరుపులు మెరిపిస్తుందో చూడాలి మరి.