Thangalaan: ‘తంగలాన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

విక్రమ్ (Vikram)  కి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది.అతను ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘శివపుత్రుడు’ ‘అపరిచితుడు’ ‘ఐ’ వంటి చిత్రాలు తెలుగులో కూడా బాగా ఆడాయి. అయితే ఆ తర్వాత విక్రమ్ నటించిన సినిమాలు వచ్చి వెళ్తున్నాయి తప్ప.. బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేయలేకపోతున్నాయి. అయినప్పటికీ విక్రమ్ ఎఫర్ట్స్ పెట్టడం ఆపలేదు. ప్రతి సినిమాకి తన బెస్ట్ ఇస్తున్నాడు. ఈ ఆగస్టు 15 కి ‘తంగలాన్’ (Thangalaan)  తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Thangalaan

‘మైత్రి’ సంస్థ తెలుగులో ఈ సినిమాని రిలీజ్ చేస్తుంది. టీజర్, ట్రైలర్.. సినిమాకి మంచి హైప్ తీసుకొచ్చాయి. అయితే తెలుగులో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో.. ఒకసారి తెలుసుకుందాం రండి :

నైజాం 1.50 cr
సీడెడ్  0.50 cr
ఆంధ్ర 2.00 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 4.00 cr

‘తంగలాన్’ చిత్రానికి రూ.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4.25 కోట్ల షేర్ ను రాబట్టాలి. సినిమాకు పాజిటివ్ టాక్ కనుక వస్తే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదు అంటే ప్రేక్షకులకి ఇంకో 3 సినిమాలు ఆప్షన్స్ గా ఉన్నాయి కాబట్టి.. దీనిని ఇగ్నోర్ చేసే ప్రమాదం ఉంది. 4 రోజులు సెలవులు ఉన్నాయి కాబట్టి.. చియాన్ విక్రమ్ ‘తంగలాన్’ ఏమాత్రం మెరుపులు మెరిపిస్తుందో చూడాలి మరి.

బ్రాండ్ వేల్యూ పోతుంది పూరీ జగన్.. ఇకనైనా జాగ్రత్త

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus