ప్రముఖ నటి మంచు లక్ష్మీ నటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి కొన్ని చిత్రాలలో నటించింది. కొన్ని టీవీ షోలు కూడా చేసింది. రీసెంట్ గా వెబ్ సిరీస్ లలో నటించడం కూడా మొదలుపెట్టింది. తాజాగా ఓ వెబ్ సిరీస్ లో నటించడానికి ఆమె అంగీకరించిందని తెలుస్తోంది. ‘పెళ్లి చూపులు’ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఓ వెబ్‌సిరీస్ తీయడానికి ప్లాన్ చేస్తున్నాడు. రాజకీయ నేపధ్యంతో కూడిన కథతో ఈ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారు.
‘పెళ్లిచూపులు’ సినిమాకి గాను ఉత్తమ ప్రాంతీయ చిత్రంతో పాటు ఉత్తమ మాటల రచయితగా కూడా జాతీయ పురస్కారాన్ని అందుకున్నాడు తరుణ్ భాస్కర్.షార్ట్ ఫిలిమ్స్ తో సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు ఈ దర్శకుడు. అతడు తీసిన ‘సైన్మా’, ‘అనుకోకుండా ఒకరోజు’ అనే లఘు చిత్రాలు అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ‘సైన్మా’ షార్ట్ ఫిలిం చూసిన మంచులక్ష్మీ తనతో ఓ సినిమా చేయాలని కొన్నేళ్ల క్రితమే తరుణ్ భాస్కర్ ని అడిగారు. దీనికోసం అప్పట్లో తరుణ్ భాస్కర్ స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకున్నాడు. కానీ అదే సమయంలో అతడి తండ్రి మరణించడంతో ప్రాజెక్ట్ వాయిదా పడింది. ఆ తరువాత ఇప్పటికి వీరి కాంబోలో ప్రాజెక్ట్ సెట్ అయింది. పూర్తిగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ప్రస్తుతం సారధి స్టూడియోస్ లో జరుగుతోంది. మరి సిరీస్ మంచు లక్ష్మికి ఎలాంటి క్రేజ్ తీసుకొస్తుందో చూడాలి!