Naga Chaitanya: ‘శాకుంతలం’ ట్రైలర్ రూపంలో చైతన్య పై సమంత సెటైర్లు..!

Advertisement

నాగ చైతన్య – సమంత 2017 అక్టోబర్ లో పెళ్లి చేసుకున్నారు. 4 ఏళ్ళపాటు హ్యాపీగా కలిసున్నారు. కానీ 2021 అక్టోబర్ లో సడన్ గా విడిపోయారు. తిరిగి కలుస్తారేమో అని వీరి అభిమానులు ఆశించారు. కానీ అలాంటిదేమి జరగలేదు. విడాకులు ప్రాసెస్ అవుతున్నాయని వీరి సన్నిహితులు తేల్చి చెప్పేశారు. వీళ్ళు ఎందుకు విడిపోయారు అంటే సరైన సమాధానం ఎవరి దగ్గర లేదు. ‘ఫ్యామిలీ మెన్’ సిరీస్ లో అశ్లీల సన్నివేశాల్లో నటించడం వల్లనే..

వీరి మధ్య గొడవలు చోటుచేసుకోవడం, అది విడాకుల వరకు దారి తీయడం జరిగిందని అంతా అనుకునే మాట. అయితే ఈ విషయంపై వీరిద్దరూ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇద్దరి కెరీర్ కు అనుకూలంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. అయితే సినిమాల రూపంలో వీరిద్దరూ ఒకరి పై ఒకరు సెటైర్లు వేసుకుంటూనే ఉన్నారు అనేది కొందరి మాట. ‘ఒక మనిషిని పట్టుకుని వేలాడే ప్రేమ కంటే స్వేచ్ఛగా వదిలేయగలిగే ప్రేమ ఎంతో గొప్పది’ అంటూ థాంక్యూ సినిమాలో నాగ చైతన్య..

సమంతని ఉద్దేశించి డైలాగ్ పెట్టుకున్నట్టు అప్పట్లో టాక్ నడిచింది. ఇప్పుడు సమంత వంతు వచ్చింది. తన శాకుంతలం సినిమాలో పరోక్షంగా నాగ చైతన్య పై సెటైర్లు వేసినట్టు అంతా చెప్పుకుంటున్నారు. ‘చిన్నప్పటి నుండి అమ్మ, నాన్న లేకుండా బ్రతికాను ఇప్పుడు మీరు కూడా దూరమైతే తట్టుకోలేను’ అనే డైలాగ్ చైతన్య ని మర్చిపోలేక పెట్టుకున్న డైలాగ్ అని కొంతమంది అంటుంటే..

‘మాయ ప్రేమని మరిపిస్తుందేమో.. అభిమానాన్ని అవమానాన్ని ఏ మాయ మరిపించలేదు’ అనే డైలాగ్ మాత్రం నాగ చైతన్య (Naga Chaitanya) పై సెటైర్ అంటూ సమంత ఈ డైలాగులు పలికిందని అంతా అనుకుంటున్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news