నందమూరి తారకరత్న ఇకలేరనే వార్త నందమూరి కుటుంబ సభ్యులను తీవ్రశోక సంద్రంలో ముంచేసింది. ఇలా నందమూరి వారసుడు చనిపోయారనే వార్త ఇటు అభిమానులలోను అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలలోనూ తీవ్ర విషాదంగా మిగిలింది. ఇలా తారకరత్న గుండెపోటు రావడంతోనే ఈయన మరణించారని తెలుస్తోంది. లోకేష్ ప్రారంభించిన పాదయాత్రలో పాల్గొన్నటువంటి తారకరత్న ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
ఇలా ఈయనకి గుండెపోటు రావడంతోనే స్పృహ తప్పి పడిపోయారని చెప్పాలి అయితే గుండెపోటు వచ్చిన వెంటనే ఈయనను సమీప ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స నిర్వహించారు. అనంతరం కుప్పంలోని మరొక ఆసుపత్రికి తరలించిన ఈయనకు అక్కడి వైద్యులు సిపిఆర్ నిర్వహించారు. దాదాపు 45 నిమిషాల పాటు శ్రమించిన వైద్యులు ఈయనకు సిపిఆర్ చేయడంతో పల్స్ రేట్ వచ్చిన అనంతరం మెరుగైన చికిత్స కోసం తనని బెంగళూరుకు తరలించారు.
ఈ విధంగా తారకరత్న బెంగళూరులో గత 23 రోజులగా వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటూ ఉన్నప్పటికీ ఈయన పరిస్థితి విషమంగానే ఉండడంతో ఫిబ్రవరి 18వ తేదీన మరణించారు.అయితే ఈయన మరణానికి కారణం మొదటి రోజు పాదయాత్రలో భాగంగా చేసిన చిన్న తప్పే కారణమని తెలుస్తుంది. సాధారణంగా గుండె పోటు వచ్చిన నిమిషాల వ్యవధిలోనే సిపిఆర్ చేయాలి అలాంటిది తారకరత్నకు సిపిఆర్ చేయడానికి దాదాపు 45 నిమిషాల సమయం పట్టింది.
ఈ విధంగా ఈయనకు సిపిఆర్ చేయటం చాలా ఆలస్యం కావడంతో అప్పటికే హార్ట్ లోని హోల్స్ అన్నీ కూడా బ్లడ్ క్లాట్ కావడంతో రక్త సరఫరా సరిగా కాక మెదడుకు సరైన మోతాదులో ఆక్సిజన్ అందలేదు తద్వారా మెదడు కూడా ఒకవైపు పూర్తిగా వాపు రావడంతో ఈయన కోమలోకి వెళ్లిపోయారు. దీంతో వైద్యానికి కూడా ఈయన బాడీ సహకరించకపోవడంతో ఈయన పరిస్థితి విషమంగా మారింది. ఇలా రోజురోజుకు ఈయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తూనే ఉండడంతో చివరికి ఈయన మరణించారు. అయితే సిపిఆర్ చేయడం ఆలస్యం కావడంతోనే ఈయన మరణించారని వెంటనే కనుక సిపిఆర్ చేసి ఉంటే తారకరత్న ప్రాణాలతో బయటపడే వారని తెలుస్తుంది.