Bangarraju: సంక్రాంతి విన్నర్ ‘బంగార్రాజు’ కి ట్రిమ్మింగ్ అట..!

నాగార్జున- నాగ చైతన్య కాంబినేషన్లో తెరకెక్కిన ‘బంగార్రాజు’ చిత్రం సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. రమ్యకృష్ణ, కృతిశెట్టి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ‘సోగ్గాడే చిన్నినాయన’ కి సీక్వెల్ గా రూపొందింది. కళ్యాణ్ కృష్ణ కురసాల నే ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహించాడు. జనవరి 14న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ ను సంపాదించుకుని బాగా క్యాష్ చేసుకుంటున్నాడు. ఈ చిత్రం మొదటి వారం పూర్తయ్యేలోపు 90శాతం రికవరీని సాధించడం ఖాయంగా కూడా కనిపిస్తుంది.

రెండో వీకెండ్ అలాగే రిపబ్లిక్ డే హాలిడే కూడా ‘బంగార్రాజు’ కి అడ్వాంటేజ్ లు అయ్యేలా ఉన్నాయి. ఇదిలా ఉండగా..రెండో వీకెండ్ ను క్యాష్ చేసుకోవడానికి ‘బంగార్రాజు’ సినిమాకి కత్తెర పడనున్నట్టు సమాచారం. ఈ మూవీలో ఓ పాటని డిలీట్ చేయడానికి చిత్ర బృందం రెడీ అయ్యిందట. వివరాల్లోకి వెళితే.. ‘బంగార్రాజు’ చిత్రంలో స్వర్గంలో నాగార్జున, రమ్యకృష్ణ లు ఉన్నప్పుడు.. వారి మధ్య ఓ రొమాంటిక్ సాంగ్ ఉంటుంది. ‘నువ్వు సిగ్గుపడితే’ అంటూ సాగే ఈ పాట వినడానికి బాగానే ఉన్నప్పటికీ..

ఈ పాటలో నాగార్జున, రమ్యకృష్ణ ల వయసు మీద పడినట్టు కనిపిస్తున్నారనే కామెంట్స్ వినిపించాయి. పైగా ఈ పాట సినిమాలో బోర్ కొట్టించే విధంగా ఉందని కూడా కొందరు పెదవి విరిచారు. దాంతో ఈ పాటని తొలగించాలని చిత్ర బృందం డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. రేపటి నుండీ అంటే జనవరి 21 నుండీ థియేటర్లలో బహుశా ఆ పాట ఉండకపోవచ్చని టాక్. ప్రస్తుతానికి ‘బంగార్రాజు’ మూవీ రన్ టైం 2 గంటల 40 నిమిషాలు గా ఉంది. మరి ఈ పాటతో పాటు ఏమైనా సన్నివేశాల్ని కూడా డిలీట్ చేస్తారేమో చూడాలి..!

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus