అయిదుగురు హీరోలతో మల్టీ స్టారర్..

కొద్దికాలం క్రితం వరకు తెలుగులో మల్టీ స్టారర్ పేరెత్తితే… ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి ఎన్టీఆర్, ఏఎన్నార్ లను గుర్తుచేసుకోవాల్సిందే. వీరి తర్వాత కొందరు ఈ సంప్రదాయం పాటించినా ముందుతరం వారిని దాటలేకపోయారు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’తో మహేశ్-వెంకటేశ్ కలిసి నటించటంతో మల్టీ స్టారర్ కి ఇన్నాళ్లకు మళ్ళీ గిరాకి వచ్చింది. అయితే ఈ ఓ యువ దర్శకుడు అయిదుగురు హీరోలతో సినిమా ప్లాన్ చేసి మల్టీ స్టారర్ అనే పదానికే కొత్త సొబగులు అద్దబోతున్నాడు.

గతేడాది సుధీర్ బాబు హీరోగా ‘భలే మంచి రోజు’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన శ్రీరామ్ ఆదిత్య గుర్తున్నాడుగా. నారా రోహిత్, సందీప్ కిషన్, నాగశౌర్య మరో ఇద్దరు యువ హీరోలతో కలిసి ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే కథ సిద్ధం చేసి ఆ హీరోలకి చెప్పి ఓకే చేయించుకున్నట్టు భోగట్టా. తొలుత శ్రీరామ్ నానితో ఓ సినిమా చేస్తున్నట్టు కథనాలు వెలువడ్డాయి. మరి ఈ మల్టీ స్టారర్ లోనే నాని కి ఇరికించబోతున్నాడా లేక అది వేరే సినిమానా అన్నది తేలాలి. ఈ సంగతి ఎలా ఉన్నా అయిదుగురు హీరోలతో సినిమా అని పెద్ద బాంబే పేల్చాడు శ్రీరామ్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus