Karthi, Trisha: కార్తీ, త్రిష వారిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ ఇదేనా?

లెజండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌-2’ రెండో భాగంలో తనకు, హీరో కార్తీ కి మధ్య ఉన్న కెమిస్ట్రీ ప్రతి ఒక్కరి నోటా చర్చించుకునేలా ఉంటుందని హీరోయిన్‌ త్రిష (Trisha) అన్నారు. ఈ చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా కోయంబత్తూరులో జరిగిన కార్యక్రమంలో హీరోలు విక్రమ్‌ (Vikram), జయం రవి (Jayam Ravi), కార్తీ (Karthi), కాళిదాస్‌తో హీరోయిన్లు త్రిష, ఐశ్వర్య లక్ష్మి, సంగీత దర్శకుడు ఏ.ఆర్‌.రెహ్మాన్‌ (A. R. Rahman), ఇంకా ఇతర మూవీ యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో త్రిష (Trisha Krishnan) మాట్లాడుతూ… ‘పొన్నియిన్ సెల్వన్-1’లో నా పాత్రకు ప్రేక్షకుల నుంచి ఊహించని స్పందన వచ్చింది. ప్రేక్షకులు చూపిన ఆదరణ, ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ చిత్రం రెండో భాగంలో ప్రతి ఒక్కరికీ సంతోషకరమైన అనుభూతి కలుగుతుందని నమ్ముతున్నా. ఈ పార్ట్‌ 2లో కార్తీకి, నాకు మధ్య ఉన్న కెమిస్ట్రీ ప్రతి ఒక్కరినీ అలరిస్తుంది. మా మధ్య వచ్చే సన్నివేశాలు అందరినీ విపరీతంగా అలరిస్తాయి.

ఇంకా ఈ పార్ట్‌లో చాలా రసవత్తరమైన పోరాట సన్నివేశాలున్నాయి. మరో రెండో వారాల్లో ప్రేక్షకుల ముందుకురానుందీ చిత్రం. మొదటి భాగం తరహాలోనే రెండో భాగం కూడా ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని అన్నారు. నిర్మాత సుభాస్కరన్‌ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్‌ (Lyca Productions), మద్రాస్‌ టాకీస్‌ (Madras Talkies)లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించగా, ఈ నెల 28వ తేదీన తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదలకానుంది.

అయితే ‘పొన్నియిన్‌ సెల్వన్‌-1’ (Ponniyin Selvan: 1) ఒక్క తమిళ్ మినహా ఇతర భాషల్లో పెద్దగా ఆదరణ పొందలేదు. కానీ ఈ పార్ట్ 2 (PS 2)మాత్రం అన్ని భాషల్లో అఖండ విజయాన్ని సాధిస్తుందనే నమ్మకాన్ని చిత్రయూనిట్ వ్యక్తపరుస్తోంది. చూద్దాం మరి.. ఏం జరుగుతుందో..?

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus