ఇది విక్రమాదిత్య అమర ప్రేమకావ్యం..!

యూనివర్సల్ రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రాధేశ్యామ్ నుంచి వచ్చిన అప్ డేట్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చింది. వచ్చింది మోషన్ పోస్టరే అయినా టీజర్ లెవల్లో దీన్ని వీక్షించారు ఫ్యాన్స్. అంతేకాదు, మూవీ టీమ్ కూడా దీన్ని టీజర్ లాగానే విడుదల చేసింది. ఈ మోషన్ పోస్టర్ లో మనం కొన్ని విషయాలు చూసినట్లయితే., ముందుగ అమ్మాయి చేతిలోనుంచి అడవి, అందులోనుంచి రైలు కనిపించాయి. అక్కడే మనకి భోగీల్లో రోమియో-జూలియట్, సలీం అనార్కలి, అలాగే దేవదాస్ పార్వతిల పోస్టర్స్ చూపించారు.

దీన్ని బట్టీ చూస్తే ఇప్పుడు ప్రభాస్ – పూజలది కూడా అమర ప్రేమకావ్యమే అని అర్ధమవుతోంది. మరి ఇద్దరూ చనిపోయి మళ్లీ ప్రేమని పొందడానికి జన్మిస్తారని చెప్పకనే చెప్పేశాడు డైరెక్టర్. పూజా హెగ్డే బ్రిడ్జి పై వెళ్తున్న రైలు బోగి డోర్‌ దగ్గర నిలుచుని గాలిని ఆశ్వాదిస్తుంటే ఆ గాలిలో డార్లింగ్ ప్రబాస్ ఆమెని చూస్తూ నించున్నాడు. ఈ స్టిల్ చూడటానికి చాలా బాగుంది. అంతేకాదు, చాలా రిచ్ గా ఈ షాట్ ని కంపోజ్ చేశారు. ఈ షాట్ చూస్తుంటే ఓ ట్రైన్‌లో వీరిద్దరి మధ్య జరిగే ప్రేమ కథగా రాధేశ్యామ్‌ తెరకెక్కినట్లు తెలుస్తోంది.

అలానే ముందు వచ్చిన అమర ప్రేమికుల బొమ్మలను చూస్తే మాత్రం ఈ సినిమా కూడా అంతటి గొప్ప అమర ప్రేమ కావ్యంగా మారబోతోందని అర్ధమవుతోంది. మరి ఈసినిమా విక్రమాదిత్య ప్రేమకథగా చరిత్రలో మిగిలిపోయి ట్రాజెడీగా ముగుస్తుందా.. లేదా సుఖాంతం అయ్యి శుభం పడుతుందా అనేది చూడాలి. ఈ మోషన్ పోస్టర్ తో వచ్చిన అప్ డేట్ కి ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పుడు ఫుల్ ఖుషీగా ఉన్నారు.

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus