The Dirty Picture2: కొత్త ‘డర్టీ పిక్చర్‌’ త్వరలోనే ప్రారంభం!

తెలుగు నటిగా జీవితం ప్రారంభించి… ఆ రోజుల్లోనే పాన్‌ ఇండియా నటిగా పేరు తెచ్చుకుంది సిల్క్‌ స్మిత. నటిగా, ఐటెమ్‌ సాంగ్‌ డ్యాన్సర్‌గా సిల్క్‌ స్మితకు దక్కినంత పేరు ఆ రోజుల్లో ఏ ఇతర నటికి కూడా దక్కలేదు అని చెబుతుంటారు. అలాంటి ఆమె కెరీర్‌ అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఈ మొత్తం కథపై బాలీవుడ్‌లో ‘ది డర్టీ పిక్చర్‌’ అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఏమైందో ఏమో.. సినిమా టీమ్‌ గట్టిగా ఆ సినిమా సిల్క్ స్మితదే అని చెప్పుకోలేకపోయింది. అయితే ఇప్పుడు సిల్క్‌ మీద మరో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారట.

విద్యా బాలన్‌ ప్రముఖ పాత్రలో రూపొందిన చిత్రం ‘ది డర్టీ పిక్చర్‌’. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాదు.. బాక్సాఫీసు దగ్గర భారీ వసూళ్లను సాధించిందీ సినిమా. ఈ సినిమా వచ్చిన పదేళ్లు పూర్తవుతున్నా ఆ సినిమా సీన్స్‌, పాటలు ఇప్పటికీ అదిరిపోతుంటాయి. ఆ సినిమాతో విద్యాబాలన్‌ స్టార్‌ నాయికగా మారింది అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ఈ సినిమాకు నెక్స్ట్‌ పార్ట్‌ను తీసుకురావాలని చూస్తున్నారు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ మొదలుపెట్టినట్లు సమాచారం.

ఈ కొత్త సినిమాలో సిల్క్‌ స్మిత బాల్యం, యవ్వనం రోజుల నాటి సంఘటనలను చూపిస్తారని చెబుతున్నారు. అయితే ఇందులో సిల్క్‌గా విద్యాబాలన్‌ నటించేది అనుమానమే. యంగ్‌ సిల్క్‌ను చూపిస్తారు కాబట్టి.. యువ నటి అయితే బాగుంటుందని అని అనుకుంటున్నారు. అయితే కొన్ని సీన్స్‌లో విద్యా బాలన్‌ కూడా కనిపిస్తుంది అని టాక్‌ వినిపిస్తోంది. 2011లో వచ్చిన ‘ది డర్టీ పిక్చర్‌’లో ఇమ్రాన్‌ హష్మీ, నసీరుద్దీన్‌ షా, తుషార్‌కపూర్‌ ఇతర కీలకపాత్రల్లో నటించారు.

ఆ సినిమాను నిర్మించిన ఎక్తా కపూర్‌, శోభా కపూర్‌ ఇప్పుడు కూడా నిర్మాతలుగా వ్యవహరిస్తారని సమాచారం. తొలి చిత్రానికి దర్శకత్వం వహించిన మిలన్‌ లూత్రియానే రెండో పార్టుకు కూడా దర్శకుడు అని టాక్‌. ఈ సినిమా ‘డర్టీ పిక్చర్‌’కి సీక్వెల్‌ అని కాకుండా ప్రీక్వెల్‌ అని చెప్పొచ్చు. ఎందుకంటే తొలి సినిమాకు ముందు కథగా ఈ సినిమా ఉండబోతోంది.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus