విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) హీరోగా పరశురామ్( బుజ్జి) (Parasuram) దర్శకత్వంలో ‘గీత గోవిందం’ (Geetha Govindam) తర్వాత రూపొందిన చిత్రం ‘ది ఫ్యామిలీ స్టార్'(The Family Star). మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి దిల్ రాజు (Dil Raju) నిర్మాత. టీజర్ ట్రైలర్స్ ప్రేక్షకులను అలరించాయి. దీంతో మొదటి నుండి సినిమా పై మంచి బజ్ ఏర్పడింది. కానీ ఏప్రిల్ 5న రిలీజ్ అయిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది.దీంతో సో సో ఓపెనింగ్స్ మాత్రమే నమోదయ్యాయి.
పండుగ పేరు చెప్పుకుని ఈ సినిమా బాగానే క్యాష్ చేసుకుంది. మరి సెకండ్ వీకెండ్ ఎలా క్యాష్ చేసుకుంటుందో చూడాలి. ఒకసారి 10 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
‘ఫ్యామిలీ స్టార్’ సినిమాకు రూ.41.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.41.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 10 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.16.98 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా రూ.24.52 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.