మెగా పవర్ స్టార్ రాంచరణ్ కి (Ram Charan) చెన్నైలోని వేల్స్ యూనివర్సీటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రధానం చేసింది. ఏప్రిల్ 13 న అనగా ఈరోజు( శనివారం నాడు) … ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో రామ్ చరణ్‌కు డాక్టరేట్‌ను ప్రధానం చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాంచరణ్ తన సతీమణి ఉపాసనతో చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించి వేల్స్ యూనివర్సిటీ చరణ్ కు డాక్టరేట్ ను కట్టబెట్టి సత్కరించినట్టు తెలుస్తుంది.
అలా గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు డాక్టర్ రాంచరణ్ అయ్యాడని స్పష్టమవుతుంది. ఇంత చిన్న వయసులో రాంచరణ్ డాక్టరేట్ ను అందుకోవడం ఓ రికార్డు అనే చెప్పాలి. దీంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక రాంచరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి చెన్నై బయల్దేరాడు. ఎయిర్ పోర్ట్ లోని పిక్స్, వీడియోస్ కూడా వైరల్ అయ్యాయి. మరోపక్క రాంచరణ్ సినిమాల విషయానికి వస్తే..
ప్రస్తుతం శంకర్ (Shankar) దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ (Game changer) మూవీ చేస్తున్నాడు రాంచరణ్. దిల్ రాజు (Dil Raju) నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అభిమానులు ఈ సినిమా కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాని కంప్లీట్ చేశాక బుచ్చిబాబు (Buchi Babu Sana) దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రాంచరణ్ రెడీ అవుతున్నారు. అలాగే సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో కూడా చరణ్ ఓ సినిమా చేయబోతున్నట్లు ఇటీవల అధికారిక ప్రకటన వచ్చింది.