టాలీవుడ్లో ఇద్దరు అగ్ర హీరోలు స్నేహితులుగా ఉంటారా? అంటే కొన్ని పేర్లు వినిపిస్తాయి. ఇక ఆ స్నేహం కనిపించాలి అంటే మొన్నీమధ్య రామ్‌చరణ్ ఇంట్లో జరిగిన పార్టీ పిక్స్ చూస్తే సరి. అయితే ఒక స్టార్ హీరో, కమెడియన్ స్నేహంగా ఉంటారా అని ప్రశ్న వస్తే… కచ్చితంగా ప్రభాస్ – ప్రభాస్ శ్రీను గురించి తెలుసుకోవాలి. ఈ ఇద్దరి స్నేహం అద్భుతం అని అంటుంటారు టాలీవుడ్ జనాలు. ఇటీవల ప్రభాస్ శ్రీను మీడియాతో మాట్లాడుతూ తమ స్నేహం గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
ప్రభాస్, ప్రభాస్ శ్రీను… ఎప్పటినుండో స్నేహితులు. ప్రభాస్‌కు స్నేహితుడు కావడం వల్లనే శ్రీను కాస్త ప్రభాస్ శ్రీను అయ్యాడు. మరి మీ కెరీర్ విషయంలో ప్రభాస్ ఏమన్నా సలహాలు ఇస్తాడా అని ప్రభాస్ శ్రీనును అడిగితే… అస్సలు సలహాలు ఇవ్వడు అని చెప్పాడు. సలహా ఇస్తే భయంతో పనిచేస్తావని, అలా చేయడం సరికాదని… ప్రభాస్ చెప్పినట్లు శ్రీను వెల్లడించారు. దీతో ఇదేదో బాగుందే అనుకుంటున్నారు నెటిజన్లు.
అంతేకాదు రియలైజేషన్‌కు ప్రభాస్ (Prabhas) ఎక్కువ సమయం ఇస్తాడని చెప్పిన ప్రభాస్ శ్రీను… ప్రభాస్‌కు నచ్చకపోవడంతో తాను కొన్ని అలవాట్లు కూడా మార్చుకున్నానని చెప్పాడు. మరి ఇతరుల మాట విని మీపై ప్రభాస్ కోప్పడిన సందర్భాలున్నాయా? అని అడిగితే… తమ మధ్య ఎప్పుడూ అలాంటి పరిస్థితి రాలేదని చెప్పాడు. తమ స్నేహం నదీ ప్రవాహం లాంటిదని, ఎప్పుడూ సాగుతూనే ఉంటుంది అని చెప్పాడు.
ప్రభాస్ శ్రీను తెరంగేట్రం చేసి 20ఏళ్లు పూర్తయ్యాయి. ‘వర్షం’, ‘చక్రం’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’, ‘డార్లింగ్’, ‘పౌర్ణమి’ తదితర చిత్రాల్లో ప్రభాస్‌తో కలిసి నటించాడు. ఇప్పుడు కూడా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇక ప్రభాస్ విషయానికొస్తే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్: ది సీజ్ ఫైర్’ చేశారు. ఈ సినిమా డిసెంబరు 22న విడుదల కానుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘కల్కి 2898 ఏడీ’ చేస్తున్నాడు. ఇక మారుతి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో ‘స్పిరిట్’ అనే సినిమా కూడా వరుసలో ఉంది.