ఇండియన్ క్రికెట్ టీంలో స్టార్ ప్లేయర్ గా, టాప్ కెప్టెన్ గా, మిస్టర్ కూల్ గా పేరొందిన మహేంద్ర సింగ్ ధోని గురించి తెలియని వారు ఎవరుంటారు. రాజమౌళి చెప్పినట్టు అప్పటివరకు గెలిచే మ్యాచ్ లను మనం టెన్షన్ పడుతూనే చూశాం. కానీ ధోని కెప్టెన్ అయ్యాక మ్యాచ్ ని ఎంజాయ్ చేస్తూ చూడటం మొదలుపెట్టాం. కొన్ని మ్యాచ్ లు లైవ్లో కనుక చూస్తే అసలు ధోని మ్యాచ్ ఆడుతున్నాడా? లేక డైరెక్షన్ చేస్తున్నాడా? అనే ఫీలింగ్ కలిగేది.
టఫ్ మ్యాచ్ లను కూడా ధోని కూల్ గా హ్యాండిల్ చేసి గెలిపించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఏ మ్యాచ్ చూసినా .. ధోని ఉంటే బాగుణ్ణు కదా అనే ఫీలింగ్ కలుగక మానదు. సరే ఇక అసలు విషయానికి వచ్చేద్దాం. రిటైర్మెంట్ తీసుకున్న ధోని నిర్మాతగా మారి సినిమాలు నిర్మించడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. తన భార్య సాక్షితో కలిసి ‘ధోని ఎంటర్టైన్మెంట్’ అనే నిర్మాణ సంస్థను స్థాపించి తమిళ్ లో మొదటి సినిమాని నిర్మించడానికి రెడీ అయ్యారు.
‘అధర్వ : ది ఆరిజన్’ అనే గ్రాఫిక్ నవల రచయిత అయిన రమేష్ తమిళ్ మణి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఇందులో హీరో, హీరోయిన్లుగా ఎవరు నటిస్తారు? అనే అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం.. ధోని దంపతులు నిర్మిస్తున్న సినిమాలో హరీష్ కళ్యాణ్, ప్రియాంక అరుల్ మోహన్ లు హీరో హీరోయిన్లుగా నటించబోతున్నారట. తమిళంలోనే కాకుండా పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.
Most Recommended Video
ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!