Jr NTR: ఎన్టీఆర్‌కీ పునీత్ రాజ్ కుమార్ ‘సివిల్ ఇంజనీర్’ సినిమాకీ సంబంధం ఏంటంటే..?

  • December 6, 2022 / 04:20 PM IST

‘కన్నడ కంఠీరవ’ డా. రాజ్ కుమార్ తనయుడు, ‘కరుణాడ చక్రవర్తి’ డా, శివ రాజ్ కుమార్ సోదరుడు, కన్నడ ‘పవర్ స్టార్‘ స్వర్గీయ పునీత్ రాజ్ కుమార్ నటుడిగానే కాకుండా గొప్ప మానవతావాదిగానూ కర్ణాటక ప్రజల, అభిమానుల మనసుల్లో చెరుగని ముద్రవేశారు.. మరణానంతరం గౌరవార్దం ఆయనకు ‘కర్ణాటక రత్న’ పురస్కారం ఇచ్చిన సంగతి తెలిసిందే. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరయ్యారు..

కాగా పునీత్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ లో ఒకటిగా నిలిచిన ‘చక్రవ్యూహ’ ఇప్పుడు తెలుగునాట ‘సివిల్ ఇంజనీర్’ పేరుతో రిలీజ్ కానుంది. దసరాకి టీజర్, దీపావళి సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేయగా.. మంచి స్పందన వచ్చింది.. రచితా రామ్ కథానాయిక కాగా.. తమిళ్ స్టార్ అరుణ్ విజయ్ విలన్ గా కనిపించాడు. ఎమ్.శరవణన్ (జర్నీ ఫేమ్) డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి కన్నడ సూపర్ స్టార్, ‘కిచ్చా’ సుదీప్ వాయిస్ ఓవర్ ఇచ్చారు.

పునీత్ ‘సివిల్ ఇంజనీర్’ గా నటించిన ఈ మూవీ ట్రైలర్ చూసి తెలుగులోని పునీత్ ఫ్యాన్స్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎమోషనల్ అయ్యారు.. డిసెంబర్ 9న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఈ సందర్భంగా పునీత్ చిత్రాన్ని సోషల్ మీడియాలో తారక్ అభిమానులు సపోర్ట్ చేస్తున్నారు..జూనియర్ ఎన్టీఆర్ కీ, పునీత్ కీ మధ్య మంచి అనుబంధం ఉంది.. దాని కారణంగానే తారక్ ఈ మూవీలో ’గెలయా గెలయా’ అనే సాంగ్ పాడాడు.

తన తల్లి కర్ణాటకి చెందిన వ్యక్తి కావడంతో తనకి చిన్నప్పటినుండే కన్నడ భాష తెలుసు.. దీంతో సునాయాసంగా, అద్భుతంగా జూనియర్ పాడిన సాంగ్ కన్నడిగులు, పునీత్ ఫ్యాన్స్ తో పాటు తెలుగు ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతమందించాడు. సితార, అభిమన్యు సింగ్, సాధు కోకిల తదితరులు కీలకపాత్రల్లో నటించిన ‘చక్రవ్యూహ’ 2016లో అత్యధిక వసూళ్లు సాధించింది.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus