Klin Kaara: బాబాయ్ పేరు కలిసొచ్చేలా కూతురికి పేరు పెట్టిన చరణ్?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతుల కుమార్తెకు ఎంతో ఘనంగా బారసాల వేడుకను నిర్వహించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారి పేరును కూడా రివీల్ చేశారు. ఇక తమ చిన్నారికి లలిత సహస్రనామాల నుంచి ఎంపిక చేసినటువంటి క్లీన్ కారా కొణిదెల అని పేరును పెట్టారు.ప్రస్తుతం మెగా వారసురాలి పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ చిన్నారి పేరుని KKK గా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

ఇలా రాంచరణ్ ఉపాసన కుమార్తె పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు రాంచరణ్ తన బాబాయి పై ఉన్నటువంటి ప్రేమను చాటుకున్నారని తన బాబాయ్ పేరు కలిసి వచ్చేలా తన కుమార్తెకు పేరు పెట్టారని చర్చలు జరుపుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ పేరుకు రామ్ చరణ్ కూతురు పేరుకు ఎక్కడ సంబంధం ఉంది అనే విషయానికి వస్తే..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైనటువంటి ఈ హీరో అసలు పేరు కళ్యాణ్ కుమార్ కొణిదెల.

పవన్ కళ్యాణ్ నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా సమయంలో పవన్ కళ్యాణ్ ను అందరూ కూడా కళ్యాణ్ బాబు అని పిలిచేవారు.ఈ విధంగా కళ్యాణ్ బాబు కాస్త పవన్ కళ్యాణ్ గా మారిపోయారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ తన కుమార్తెకు తన బాబాయ్ ఒరిజినల్ పేరు కళ్యాణ్ కుమార్ కొణిదల KKK పేరు కలిసొచ్చే విధంగా తన కుమార్తెకు కూడా క్లీన్ కారా కొణిదెల (Klin Kaara) KKK అని నామకరణం చేశారని పలువురు ఇద్దరి పేర్లు మ్యాచ్ చేస్తున్నారు.

ఇలా పవన్ కళ్యాణ్ ఒరిజినల్ పేరుతో రామ్ చరణ్ కుమార్తె పేరు మ్యాచ్ అవడంతో బాబాయ్ పేరుని తన కుమార్తెకు కలిసి వచ్చేలా రాంచరణ్ తన కూతురికి పేరు పెట్టారని మెగా ఫాన్స్ ఈ పేర్లను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇక ఉపాసన రాంచరణ్ తమ కూతురుకు లలితా సహస్రనామాలలో ఒకటైనటువంటి ఈ పేరును తమ కుమార్తెకు ఎంపిక చేసాము అంటూ తెలియజేశారు.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus