Yashoda Movie: ఆ ఇంగ్లీష్ సినిమాకు యశోద మూవీకి లింక్ ఇదే!

  • November 12, 2022 / 02:18 PM IST

హరి హరీష్ డైరెక్షన్ లో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన యశోద మూవీ అబవ్ యావరేజ్ టాక్ తో ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాకు తొలిరోజు భారీ స్థాయిలోనే కలెక్షన్లు వచ్చాయని బోగట్టా. అయితే టార్గెట్ ఎక్కువగా ఉండటంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడం సాధ్యమేనా? అనే చర్చ జరుగుతోంది. సామ్ సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్లు రావాలంటే ఈ టాక్ సరిపోదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

అయితే యశోద సినిమా టీజర్, ట్రైలర్ చూసి భారీ అంచనాలతో థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు సినిమాలోని కొన్ని సన్నివేశాలను చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. సినిమాలో ఉన్న పోకిరి క్లైమాక్స్ తరహా ట్విస్ట్ సమంత అభిమానులకు నచ్చేలా ఉంది. అయితే ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు ఇంగ్లీష్ మూవీ లెవెల్ 16 తో యశోదకు పోలికలు ఉన్నాయని ఆ సినిమా స్పూర్తితోనే ఈ సినిమా తెరకెక్కిందని కామెంట్లు చేస్తున్నారు.

ఈ సినిమా దర్శకులు హరి హరీష్ ఈ కామెంట్ల గురించి ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. యశోద మూవీలో మొదట పాజిటివ్ గా కనిపించిన చాలా పాత్రలు ఆ తర్వాత నెగిటివ్ గా కనిపించడం గమనార్హం. సినిమాలోని కొన్ని ట్విస్టులు బాగానే ఉన్నా నమ్మశక్యంగా లేవని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే సమంత నటన మాత్రం ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉందని ఫ్యాన్స్ చెబుతున్నారు.

సమంత నటనకు హ్యాట్సాఫ్ అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. యశోద సినిమా సక్సెస్ తో సమంత భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు భారీగా బిజినెస్ జరగనుంది. యశోద మూవీ పరిమిత బడ్జెట్ లో తెరకెక్కి ఉంటే ఈ సినిమాకు మరింత ప్లస్ అయ్యి ఉండేదని కొంతమంది నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బడ్జెట్ ను తగ్గించి ఉంటే యశోద మూవీకి ప్లస్ అయ్యేదని మరి కొందరు చెబుతున్నారు.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus