Naga Chaitanya, Samantha: సమంత చేసిన కామెంట్ల వెనుక అర్థమిదేనా?

స్టార్ హీరోయిన్ సమంత నాగచైతన్యల విషయంలో గత కొన్ని నెలలుగా వైరల్ అయిన పుకార్లు చివరకు నిజమయ్యాయి. తాము కలిసి ఉండలేమని సమంత, నాగచైతన్య ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే గతంలో పలు సందర్భాల్లో సమంత చేసిన కామెంట్లు ప్రస్తుతం చర్చకు వస్తున్నాయి. గతంలో ఆహారం కంటే సెక్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని సమంత సంచలన వ్యాఖ్యలు చేశారు. క్యాస్టింగ్ కౌచ్ గురించి సైతం సమంత స్పందించి పలు సందర్భాల్లో బోల్డ్ కామెంట్స్ చేశారు.

సమంత గర్భవతి అయ్యారంటూ పలు వార్తలు ప్రచారంలోకి రాగా 2017 సంవత్సరం నుంచి తాను గర్భవతిగా ఉన్నానని అయితే ఆ బిడ్డ బయటకు రావాలని అనుకోవడం లేదని ఆమె చెప్పుకొచ్చారు. మరో సమయంలో 2022 సంవత్సరం ఆగష్టు 7వ తేదీన బిడ్డకు జన్మనిస్తానంటూ సమంత కామెంట్లు చేశారు. క్యాస్టింగ్ కౌచ్ ఎక్కడైనా ఉంటుందని నల్లగొర్రెలు ఎక్కడైనా ఉంటాయంటూ సమంత షాకింగ్ కామెంట్లు చేశారు. ఫుడ్, సెక్స్ రెండూ ముఖ్యమేనని అయితే సెక్స్ కే ఎక్కువ ప్రాధాన్యతని సమంత చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి.

యాక్టింగ్ లైఫ్ కు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చిన సమంత మళ్లీ వరుస సినిమా ఆఫర్లతో బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది. చైతన్య ప్రస్తుతం బంగార్రాజు, థ్యాంక్యూ సినిమాలలో నటిస్తుండగా ఈ సినిమాల రిలీజ్ డేట్లకు సంబంధించిన ప్రకటనలు రావాల్సి ఉంది. లైంగిక వేధింపుల ఫిర్యాదులను పరిష్కరించడానికి ప్రత్యేక సెల్ ను సైతం ఏర్పాట్లు చేయాలని సమంత గతంలో సూచనలు చేసిన సంగతి తెలిసిందే.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus