ప్రిన్స్ టు రవి.. ‘బిగ్ బాస్’ లో జరిగిన 10 షాకింగ్ ఎలిమినేషన్స్..!

‘బిగ్ బాస్’ లో నామినేషన్స్ ప్రక్రియ గురించి ఎలిమినేషన్స్ ప్రక్రియ గురించి అందరికీ తెలిసిన సంగతే. హౌస్మేట్స్ తోటి కంటెస్టెంట్స్ లో ఎవరినైతే ఎక్కువగా నామినేట్ చేస్తారో వాళ్ళే ఎలిమినేషన్స్ లిస్ట్ లో చేరే కంటెస్టెంట్లు. ఇక ఎలిమినేషన్ లైనప్ లో ఎవరికైతే ఎక్కువ ఓట్లు పడతాయో వాళ్ళు సేఫ్ అవుతారు.. తక్కువ ఓట్లు పడినవాళ్లు ఎలిమినేట్ అవుతారు. కానీ సీజన్ 5 లో ఏంటో మొత్తం గమ్మత్తుగా జరిగింది. ఒక్కరు నామినేట్ చేసినా ‘బిగ్ బాస్’ వాళ్ళని ఎలిమినేషన్స్ లిస్ట్ లో వేసేసి వాళ్ళని సైడ్ చేసేసాడు. ఈ సీజన్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అనుకున్నవాళ్ళంతా ఎలిమినేట్ అయిపోయారు. ఒక్క ఈ సీజన్లో మాత్రమే కాదు ఫస్ట్ సీజన్ నుండీ స్ట్రాంగ్ అనుకున్న వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. కాకపోతే ఈ సీజన్లో ఆ సంఖ్య కాస్త పెద్దది. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి…ఈ 5 సీజన్లలో జనాలను షాక్ గురి చేసిన ఎలిమినేషన్స్ ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) పిన్స్ :

సీజన్ 1 కంటెస్టెంట్ ప్రిన్స్.. మొదటి నుండీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకున్నాడు. కానీ చివరికి వచ్చేసరికి పరిస్థితి తారుమారు అయిపోయింది.

2) పూజా రామచంద్రన్ :

సీజన్2 లో ఈమె వైల్డ్ కార్ట్ ఎంట్రీ ఇచ్చింది. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకుంది. కెప్టెన్ కూడా అయ్యింది. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా 2 వారాలకే ఎలిమినేట్ అయ్యింది.

3) రోహిణి :

సీజన్ 3 లో ఈమె కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకుంది. కానీ ఈమె అల్లరి చేష్టల వల్ల నామినేట్ అవ్వడం.. తక్కువ ఓట్లు పడడంతో ఎలిమినేట్ అవ్వడం జరిగింది.

4) అలీరెజా :

సీజన్3 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకున్నాడు. కానీ 7వారాలకే ఎలిమినేట్ అవ్వడం అందరినీ షాక్ కు గురిచేసింది. అటు తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి టాప్ 5 కి వెళ్ళినా ఆ ఉత్సాహం మాత్రం చూపించలేకపోయాడు.

5) వరుణ్ సందేష్ :

సీజన్ 3 లో ఇతను టాప్ 5 వరకు వెళ్ళాడు కానీ.. ఆడియెన్స్ ఇతన్ని టాప్ 3 లో ఊహించుకున్నారు. కానీ టాప్ 4వరకే పరిమితమయ్యి ఎలిమినేట్ అయ్యాడు.దీంతో ఆడియెన్స్ బాగా డిజప్పాయింట్ అయ్యారు.

6) దేవి నాగవల్లి :

సీజన్ 4లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకున్న దేవి నాగవల్లి..3 వారమే ఎలిమినేట్ అవ్వడం అందరినీ షాక్ కు గురిచేసింది.

7)లాస్య :

సీజన్ 4 లో టాప్ 5 లో ఉంటుంది అనుకుంటే.. 80రోజులకే ఎలిమినేట్ అయ్యింది.

8)శ్వేతా వర్మ :

సీజన్ 5 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్లలో ఒకరనుకున్న ఈమె.. ఎవ్వరూ ఊహించని విధంగా 6వ వారం ఎలిమినేట్ అయ్యింది.

9)విశ్వ :

ఇతను కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకున్నాడు. కానీ టాప్ 5 లోలేకుండానే ఎలిమినేట్ అవ్వడం అందరినీ షాక్ కు గురిచేసింది.

10) యాంకర్ రవి :

టైటిల్ విన్నర్ రేసులో ఉంటాడు అనుకుంటే… ఫినాలేకి 3 వారాల ముందే ఎలిమినేట్ అవ్వడం అందరినీ షాక్ కు గురిచేసింది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus