అన్ స్టాపబుల్ షోలో సందడి చేయనున్న మాజీ ముఖ్యమంత్రి?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలలో హీరోగా నటిస్తూనే మరోవైపు ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కార్యక్రమం మొదటి సీజన్ ఎంతో మంచి విజయాన్ని అందుకోగా రెండవ సీజన్ అంతకుమించి ఉండేలా నిర్వాహకులు ప్లాన్ చేశారు. ఇక రెండవ సీజన్ లో కేవలం సినిమా హీరోలు మాత్రమే కాకుండా రాజకీయ నాయకులను కూడా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమం పై భారీ అంచనాలు పెంచారు.

ఇప్పటికే ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ రావడంతో నందమూరి బాలకృష్ణ తమ వ్యక్తిగత విషయాలు గురించి మాత్రమే కాకుండా రాజకీయాల గురించి కూడా ప్రస్తావించారు.ఇకపోతే అనంతరం తదుపరి ఎపిసోడ్ లో యంగ్ హీరోలతో సందడి చేసిన బాలయ్య తాజాగా వచ్చే ఎపిసోడ్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇకపోతే బాలకృష్ణ ఈ కార్యక్రమానికి గెస్ట్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హాజరు కాబోతున్నట్టు సమాచారం.

ఇలా ఈ కార్యక్రమానికి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హాజరు కాబోతున్నారని తెలియడంతో మరోసారి వీరిద్దరి మధ్య రాజకీయాల గురించి ప్రస్తావన వస్తాదనే విషయం అర్థమవుతుంది. మరి బాలయ్య కిరణ్ కుమార్ రెడ్డిని ఎలాంటి ప్రశ్నలు వేసి సమాధానాలు రాబడతారనే విషయంపై ఆసక్తి నెలకొంది. ఇకపోతే కిరణ్ కుమార్ రెడ్డి కేవలం ముఖ్యమంత్రిగా మాత్రమే కాకుండా బాలకృష్ణకు మంచి స్నేహితుడు అనే విషయం చాలా మందికి తెలియదు.

వీరిద్దరూ చిన్నప్పటి నుంచి ఎంతో మంచి స్నేహితులని ఇద్దరు కలిసి ఒకే స్కూల్లో చదువుకున్నారని తెలుస్తోంది. ఇలా స్నేహితుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి బాలయ్య ఎలా సందడి చేస్తారో అనే విషయంపై అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus