నాని, శ్రీకాంత్ ఓదెల కాంబో అంటేనే ఆడియన్స్ లో ఒక స్పెషల్ క్రేజ్ ఉంది. దసరా సినిమాతో వీళ్లు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రచ్చ చేశారో చూశాం. ఇప్పుడు ‘ది ప్యారడైజ్’తో అంతకు మించి అనేలా ప్లాన్ చేస్తున్నారు. 2026 మార్చి 26న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా అప్డేట్స్ కూడా మంచి హైప్ క్రియేట్ చేస్తున్నాయి. అయితే లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్ చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు షాక్ అవుతున్నారు. దానికి కారణం మన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు.
మామూలుగా సంపూ అనగానే మనకు గుర్తొచ్చేది పేరడీలు, కామెడీ సీన్లే. కానీ శ్రీకాంత్ ఓదెల ఆయన్ని డీల్ చేసిన విధానం చూస్తుంటే మాత్రం మైండ్ బ్లాక్ అవుతోంది. అసలు పోస్టర్ లో ఉన్నది సంపూనా కాదా అని జనాలు డౌట్ పడే రేంజ్ లో ఆయన్ని మార్చేశారు. ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ చాలా వైల్డ్ గా ఉండబోతోందని ఆ లుక్ చూస్తేనే అర్థమవుతోంది.
చేతిలో గొడ్డలి, నోట్లో బీడీ, చింపిరి జుట్టుతో సంపూను చూస్తుంటే నిజంగానే భయమేస్తోంది. ఈ పాత్ర కోసం ఆయన చాలా బరువు తగ్గి, ఒక ఊర మాస్ లుక్ లోకి మారిపోయారు. కామెడీ ఇమేజ్ ఉన్న ఒక ఆర్టిస్ట్ ను ఇలా ప్రెజెంట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. దర్శకుడి విజన్ ఏంటో ఈ ఒక్క పోస్టర్ తో క్లారిటీ వచ్చేసింది.
ఇందులో సంపూ క్యారెక్టర్ పేరు ‘బిర్యానీ’. పేరు వెరైటీగా ఉన్నా, సినిమాలో ఇది చాలా సీరియస్ రోల్ అట. హీరో నాని పోషిస్తున్న ‘జడల్’ పాత్రకు బెస్ట్ ఫ్రెండ్ గా, నమ్మకానికి కేరాఫ్ అడ్రస్ గా సంపూ కనిపించనున్నారు. హీరో పక్కన ఉండి కామెడీ చేసే ఫ్రెండ్ లా కాకుండా, కథలో ఎమోషనల్ గా ట్రావెల్ అయ్యే పాత్ర ఇదని టాక్ వినిపిస్తోంది.
ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ లో మోహన్ బాబు, రాఘవ్ జుయల్ లాంటి స్ట్రాంగ్ ఆర్టిస్టులు ఉన్నారు. వీరికి తోడు రాక్ స్టార్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తుండటంతో హైప్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. నిర్మాత సుధాకర్ చెరుకూరి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ‘బిర్యానీ’ లుక్ తో సినిమా మీద అంచనాలు డబుల్ అయ్యాయి. కమెడియన్ గానే కాకుండా సీరియస్ నటుడిగా సంపూ ఈ సినిమాతో తనలోని కొత్త యాంగిల్ ని చూపించబోతున్నారు.