Akhanda 2: ‘అఖండ 2’ నష్టాల లిస్టుతో బోయపాటిని కలిసిన బయ్యర్లు

‘అఖండ 2′(Akhanda 2) భారీ అంచనాల నడుమ డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొంత మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. బాలయ్య- బోయపాటి కాంబోకి ఉన్న క్రేజ్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాని నిలబెట్టింది. ఈ సినిమా విషయంలో హీరో బాలయ్య డ్యూటీ బాలయ్య చేశారు. దర్శకుడు బోయపాటి డ్యూటీ బోయపాటి చేశారు. ఆడియన్స్ డ్యూటీ.. ఆడియన్స్ చేశారు. ఫ్యాన్స్ డ్యూటీ ఫ్యాన్స్ చేశారు. అందరూ తమ వంతు న్యాయం చేశారు.

Akhanda 2

కానీ నిర్మాతలైన ’14 రీల్స్ ప్లస్’ వారి వల్ల ‘అఖండ 2’ కి అన్యాయం జరిగింది. డిసెంబర్ 5న ఈ సినిమాని రిలీజ్ చేయాలి. డిసెంబర్ 4 నుండే ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. టికెట్ హైక్స్ కి ప్రభుత్వాల నుండి అనుమతులు కూడా తెచ్చుకున్నారు. కానీ ‘ఎరోస్ ఇంటర్నేషనల్’ వారి వద్ద ఉన్న వీళ్ళ పాత బకాయిల వల్ల.. వాళ్ళు రిలీజ్ కి అభ్యంతరాలు తెలుపుతూ కోర్టుకెక్కారు. దాని వల్ల నష్టం దాదాపు రూ.50 కోట్ల పైమాటే. అనుకున్న టైంకి సినిమా రిలీజ్ కాలేదు.

సినిమాపై ఉన్న ఆసక్తి చాలా మందిలో సన్నగిల్లింది. దాని ప్రభావం కలెక్షన్స్ పై పడింది.’అఖండ 2′ బాక్సాఫీస్ వద్ద రూ.66 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేసింది. కానీ సినిమాని రూ.100 కోట్లకు అమ్మారు. ఆ రకంగా చూస్తే ఈ సినిమా కమర్షియల్ ఫెయిల్యూర్. నష్టం రూ.30 కోట్ల దాకా ఉంది. దీంతో బయ్యర్లు నిర్మాతలను అప్రోచ్ అవ్వడం మొదలుపెట్టారు. కానీ వాళ్ళు సరైన రెస్పాన్స్ ఇవ్వడం లేదు. మరోవైపు బయ్యర్లు సంక్రాంతి సినిమాలకు అమౌంట్ అడ్జస్ట్మెంట్లు వంటివి చేసుకోవాలి.

అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో వారు దర్శకుడు బోయపాటి శ్రీనుని అప్రోచ్ అయ్యారు. బోయపాటి కూడా తన వంతు సాయం.. తాను చేస్తానని హామీ ఇచ్చారు. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో నిర్మాతలకు రావాల్సిన పెండింగ్ అమౌంట్లు వస్తే ‘అఖండ 2’ బయ్యర్స్ నష్టాలను కొంతవరకు తీర్చే అవకాశం ఉంది.

రాశికి అనసూయ క్షమాపణలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus