The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

‘ది రాజా సాబ్’ (The Rajasaab) షూటింగ్లో భాగంగా టాకీ పూర్తయినట్టు,ఇప్పటివరకు 3 గంటల 30 నిమిషాల ఫుటేజీ వచ్చినట్టు.. ఇదివరకే ఫిల్మీ ఫోకస్ మీకు ఎక్స్ క్లూజివ్ గా చెప్పడం జరిగింది. పాటల చిత్రీకరణ కోసం 16 నిమిషాల వరకు నిడివి పెరగొచ్చు అని చెప్పడం కూడా జరిగింది.

The Rajasaab

మొత్తంగా 3 గంటల 45 లేదా 3 గంటల 50 నిమిషాల వరకు ఫైనల్ రన్ టైం రావచ్చని కూడా తెలపడం జరిగింది. ఈరోజు జరిగిన టీజర్ లాంచ్ వేడుకలో దర్శకుడు మారుతి (Maruthi).. ఈ విషయంపై పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. రన్ టైం మూడున్నర గంటల వరకు వచ్చినట్లు ఆయన చెప్పడం… కానీ ఫైనల్ గా అంత రన్ టైం ఎందుకు, 3 గంటలకు బోర్ కొట్టకుండా కుదిస్తాం అని మారుతి (Maruthi) తెలిపారు.

మరోపక్క నిర్మాత టి.జి.విశ్వప్రసాద్ (TG Vishwa Prasad) చొరవ చేసుకుని.. ఈ సినిమా రన్ టైం మూడున్నర గంటలు వచ్చింది కాబట్టి.. 2 పార్టులుగా చేద్దాం అని చెప్పినట్టు కూడా రివీల్ చేశారు. ‘రాజాసాబ్ 2’ ఐడియా దర్శకుడు మారుతి (Maruthi) వద్ద ఉంది. కానీ దీనిని ఒక పార్ట్ గానే చెప్పాలనేది అతని ఎజెండా.

పార్ట్ 2 ని బలవంతంగా రుద్దనని, మంచి ఐడియాతో వస్తానని మారుతి (Maruthi) క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది. ఒక్కటైతే క్లియర్. ‘ది రాజాసాబ్’ (The Rajasaab)  నిడివి మూడున్నర గంటలు వచ్చేసింది. అనుకున్నదానికంటే కొంచెం ఎక్కువ పోర్షన్ షూట్ చేశారు మారుతి. ఇంకా సాంగ్స్ చిత్రీకరణ, కొంత ప్యాచ్ వర్క్ ఉంది కాబట్టి.. మరో 20 నిమిషాలు పెరిగే అవకాశం ఉంది. సో ఎడిటర్ కి పెద్ద పనే ఉండబోతుంది అని స్పష్టమవుతుంది.

హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

రాజా సాబ్ రన్ టైమ్ 210 నిమిషాలు ??

రాజా సాబ్ సినిమా కంటెంట్ 3 గంటలే..
రన్ టైమ్ పై క్లారిటీ ఇచ్చిన మారుతి#TheRajaSaab #TheRajaSaabTeaser#Prabhas #MalvikaMohanan #NidhhiAgerwal #Maruthi #TGVishwaPrasad #ThamanS #SKN pic.twitter.com/keVQbIFGMC

— Filmy Focus (@FilmyFocus) June 16, 2025


పార్ట్ 2 అంటే ఏదో కావాలని మాత్రం లాగను#TheRajaSaab #TheRajaSaabTeaser#Prabhas #MalvikaMohanan #NidhhiAgerwal #Maruthi #TGVishwaPrasad #ThamanS #SKN pic.twitter.com/kdGcayRbdV

— Filmy Focus (@FilmyFocus) June 16, 2025

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus