ఆ ముగ్గురు బిగ్ బాస్ విన్నర్స్ లో ఒక్కడే సక్సెస్ అయ్యాడు

వివిధ నేపధ్యాలకు చెందిన కొందరు సెలెబ్రిటీలను ఓ ఇంటిలోకి పంపి వారి రోజువారీ చర్యలను, వివిధ టాస్క్ ల ద్వారా వారి ఎమోషన్స్, ఫీలింగ్స్ బయటపడేలా చేయడం వాటిని కెమెరాలో బంధించి ప్రేక్షకులకు అందించడం అనే ఓ కొత్త కాన్సెప్ట్ తో విదేశాలలో మొదలైన బిగ్ బ్రదర్ షో స్పూర్తితో ఇండియాలో బిగ్ బాస్ షో ప్రారంభమైంది. 2007లో లండన్ లో ప్రసారమైన బిగ్ బ్రదర్ షోలో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి పాల్గొనడమే కాకుండా టైటిల్ గెలుచుకున్నారు. ఈ షోలో శిల్పా శెట్టి పై జేన్ గూడి అనే మహిళ జాతి వివక్ష వ్యాఖ్యలు చేసి అప్పట్లో సంచలనం సృష్టించారు. కాగా హిందీలో మొదటిసారి 2006లో బిగ్ బాస్ ప్రసారం జరిగింది. అది సూపర్ సక్సెస్ కావడంతో కొన్నేళ్ల క్రితం ప్రాంతీయ భాషలలోకి కూడా బిగ్ బాస్ వ్యాపించింది.

ఇక తెలుగు బిగ్ బాస్ షో గురించి మాట్లాడుకుంటే 2017లో ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా ప్రారంభమైంది. ఆతరువాత సీజన్ నాని, గత సీజన్ నాగార్జున హోస్ట్ గా ఉండి నడిపించారు. ఐతే ఫస్ట్ సీజన్లో శివ బాలాజీ విన్నర్ కాగా సెకండ్ సీజన్లో కౌశల్ గెలిచారు. ఇక నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన మూడవ సీజన్లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ గా నిలిచారు. ఐతే ఈ ముగ్గురిలో రాహుల్ మాత్రమే బిగ్ బాస్ తో వచ్చిన ఫేమ్ తో సక్సెస్ ఫుల్ గా కెరీర్ ని కొనసాగితున్నాడు. ఫస్ట్ సీజన్ లో గెలించిన శివ బాలాజీ కానీ, సెకండ్ సీజన్లో గెలిచిన కౌశల్ కి కానీ కెరీర్ పరంగా బిగ్ బాస్ నుండి ఒరిగిందేమీ లేదు. రాహుల్ మాత్రం సింగర్ గా మరియు నటుడిగా కూడా అవకాశాలు దక్కించుకుంటున్నాడు. అతనికి ఇప్పుడు మంచి క్రేజ్ ఉంది. ముగ్గురు బిగ్ బాస్ టైటిల్ విన్నర్స్ లో రాహుల్ మాత్రమే కెరీర్ పరంగా ఎందుకు ఎదిగాడన్నది ఆసక్తికరం.

Most Recommended Video

జాను సినిమా రివ్యూ & రేటింగ్!
సవారి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus