Allari Naresh: అల్లరి నరేష్ నటించిన ఆ మూవీ ఫ్లాప్ కావడం వెనుక ఇంత కథ ఉందా?

ప్రతి హీరో సినిమా హిట్ కావాలనే సినిమాలో నటిస్తారు. అయితే కొన్ని సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్న తర్వాత ఆ సినిమా విషయంలో తప్పు ఎక్కడ జరిగిందో అర్థమవుతుంది. అలా అల్లరి నరేష్ (Allari Naresh) కెరీర్ లో ఒకింత భారీ అంచనాలతో విడుదలై ప్రేక్షకులను నిరాశపరిచిన సినిమాలలో నువ్వంటే నాకిష్టం (Nuvvante Naakistam) సినిమా కూడా ఒకటి. ఇ.వి.వి. సత్యనారాయణ (E. V. V. Satyanarayana) డైరెక్షన్ లో ఆర్యన్ రాజేష్ (Aryan Rajesh), అల్లరి నరేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.

అనురాధ మెహతా (Anuradha mehta) ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాకు అప్పట్లో ట్రైలర్ ను కూడా ప్రదర్శించకుండా వెరైటీగా ప్రమోషన్స్ చేయడం జరిగింది. అయితే తాను, ఆర్యన్ రాజేష్ రియల్ లైఫ్ లో బ్రదర్స్ కావడం వల్లే నువ్వంటే నాకిష్టం సినిమా ఫ్లాపైందని అల్లరి నరేష్ పేర్కొన్నారు. సినిమాలో అన్నాదమ్ములం కాకపోయినా రియల్ లైఫ్ లో అన్నాదమ్ములం కావడంతో ఆ సినిమా ఆడియన్స్ మెప్పు పొందలేదని ఆయన చెప్పుకొచ్చారు.

ఆ సినిమాలో ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ లలో ఒకరే నటించి మరో పాత్రకు మరో నటుడిని ఎంచుకుని ఉంటే ఆ సినిమా రిజల్ట్ మరింత బెటర్ గా ఉండేదని చెప్పవచ్చు. ఆర్యన్ రాజేష్ తో తాను కలిసి నటించని చెబుతూ అల్లరి నరేష్ ఈ కామెంట్లు చేశారు. బ్రదర్ సెంటిమెంట్ తో అద్భుతమైన కథ వస్తే ఆర్యన్ రాజేష్ తో కలిసి నటించడానికి అభ్యంతరం లేదని నరేష్ కామెంట్లు చేశారు.

మరోవైపు అల్లరి నరేష్ నటించిన ఆ ఒక్కటీ అడక్కు (Aa Okkati Adakku) సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. అల్లరి నరేష్ తర్వాత సినిమాలతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది. అల్లరి నరేష్ కు భారీ హిట్ దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అల్లరి నరేష్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus