Santanu Hazarika , Shruti Haasan: శృతితో బ్రేకప్ పై రియాక్ట్ అయిన శాంతాను.. ఏం చెప్పారంటే?

సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలలో చాలా జోడీలు విడాకులు తీసుకోవడం, పెళ్లికి ముందే విడిపోవడం జరుగుతోంది. చాలా కాలం పాటు సంతోషంగా ఉన్న జోడీలు విడిపోతూ అభిమానులకు షాకిస్తున్నారు. శృతి హాసన్ (Shruti Haasan) , శాంతాను విడిపోయారంటూ కొన్నిరోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా వార్తలు తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ బ్రేకప్ వార్తల గురించి తాజాగా శాంతాను రియాక్ట్ అయ్యారు. ఇప్పటికే శృతి, శాంతాను ఇన్ స్టాగ్రామ్ లో ఒకరినొకరు ఫాలో కావడం లేదు.

“నన్ను క్షమించండి నేను ఆ వార్తలపై రియాక్ట్ కావాలని అనుకోవడం లేదు” అంటూ బ్రేకప్ వార్తలు నిజమేనని శాంతాను చెప్పకనే చెప్పేశారు. శాంతాను సన్నిహితులు ఈ వార్తలపై స్పందిస్తూ వ్యక్తిగత విభేదాల వల్ల వాళ్లు స్నేహపూర్వకంగా విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారని కామెంట్లు చేశారు. శృతి హాసన్ తాజాగా సోషల్ మీడియాలో ఇది ఒక క్రేజీ రైడ్ అని నా గురించే కాక ఇతర వ్యక్తుల నుంచి చాలా నేర్చుకున్నానని పేర్కొన్నారు.

శాంతాను గురించి శృతి హాసన్ ఈ పోస్ట్ చేశారని చాలామంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. శృతి హాసన్ భవిష్యత్తు సినిమాల ప్రమోషన్స్ లో భాగంగా శాంతానుతో బ్రేకప్ గురించి పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది. శృతి హాసన్ ప్రస్తుతం సలార్2 (Salaar) సినిమాతో బిజీగా ఉన్నారు. సలార్2 సినిమా ఏకంగా 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోందని యుద్ధ సన్నివేశాల కోసం ఎక్కువ మొత్తం ఖర్చు చేయనున్నారని సమాచారం అందుతోంది.

ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ఇప్పటికే సలార్2 స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేశారని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ వేగంగా సినిమాలను తెరకెక్కిస్తూ విజయాలను సొంతం చేసుకుంటున్నారు. శృతి హాసన్ కు సలార్2 సినిమాలో ఎంత ప్రాధాన్యత ఇస్తారో చూడాలి. కియారా అద్వానీ (Kiara Advani)  ఈ సినిమాలో నటిస్తున్నారని జరిగిన ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని తేలిపోయింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus