Geetu Royal Suffuring With A Desease : ఆ అరుదైన వ్యాధి వల్ల గీతూ రాయల్ కు ఇబ్బందులు.. ఏమైందంటే?

బిగ్ బాస్ షో సీజన్6 కంటెస్టెంట్ గా ఊహించని స్థాయిలో గీతూ రాయల్ (Geetu Royal) పాపులారిటీని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. గీతూ రాయల్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో ఆమె బిహేవియర్ పై సోషల్ మీడియా వేదికగా నెగిటివ్ కామెంట్లు వినిపించాయి. బిగ్ బాస్ సీజన్7 సమయంలో బిగ్ బాస్ బజ్ కు హోస్ట్ గా చేయడం ద్వారా ఆమె వార్తల్లో నిలిచారు. కొన్ని వారాల క్రితం ఆమె ఒక వివాదంలో చిక్కుకున్నారు.

ఎప్పుడూ ఫుల్ ఎనర్జీ లెవెల్స్ తో కనిపించే గీతూ రాయల్ ఆస్పత్రి బెడ్ పై కనిపించి ఒకింత షాకిచ్చారు. అరుదైన వ్యాధితో తాను బాధ పడుతున్నానంటూ ఆమె ఒక వీడియోను రిలీజ్ చేయడం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సమస్యతో గత 5 నెలలుగా బాధ పడుతున్నానని ఆమె చెప్పుకొచ్చారు. బ్యాంకాక్ పర్యటన వల్లే ఈ సమస్య వచ్చిందని ఫీలవుతున్నానని ఆమె కామెంట్లు చేశారు.

ఈ వ్యాధి నుంచి బయటపడటానికి ప్రతి వారం ఇంజెక్షన్లు చేయించుకోవాల్సి వస్తోందని గీతూ రాయల్ వెల్లడించారు. బ్యాంకాక్ పర్యటనలో రకరకాల ఫుడ్ ఐటమ్స్ తినడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందేమో అని ఫీలవుతున్నానని ఆమె పేర్కొన్నారు. మొదట ఒక గాయమైందని ఎన్ని మందులు వాడినా ఆ గాయం తగ్గలేదని గీతూ రాయల్ చెప్పుకొచ్చారు. డాక్టర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని చెప్పారని ఆమె తెలిపారు.

రెండేళ్లు చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించారని గీతూ రాయల్ కామెంట్లు చేశారు. డాక్టర్ మాటలు విని డిప్రెషన్ తో బాధ పడుతున్నానని గీతూ రాయల్ తెలిపారు. వైద్యులు చెప్పిన విధంగా జీవన విధానాన్ని మార్చుకోకపోతే 40 సంవత్సరాలకు మించి బ్రతకడం కష్టమని గీతూ రాయల్ తెలిపారు. ఆమె చెప్పిన విషయాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. గీతూ రాయల్ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus