Aamani About Her Divorce: విడాకుల పై మొదటిసారి స్పందించిన ఆమని.!

సీనియర్ హీరోయిన్ ఆమని (Aamani) అందరికీ సుపరిచితమే. సీనియర్ నరేష్, స్టార్ డైరెక్టర్ ఇ.వి.వి.సత్యనారాయణ కాంబినేషన్లో తెరకెక్కిన ఆల్ టైం హిట్ మూవీ ‘జంబలకిడిపంబ’ తో ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘మిస్టర్ పెళ్ళాం’ ‘శుభలగ్నం’ ‘శుభమస్తు’ ‘మావిచిగురు’ ‘వంశానికొక్కడు’ (Vamsanikokkadu) ‘శుభ సంకల్పం’ వంటి హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ అయ్యింది. కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలో ఓ తమిళ నిర్మాతను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

అటు తరువాత ఆమని భర్త నిర్మించిన చాలా సినిమాలు ప్లాప్ కావడంతో.. అప్పుల పాలయ్యారట. దీనివల్ల వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయినట్టు గతంలో ప్రచారం జరిగింది. కానీ ఆమని ఎప్పుడూ ఈ విషయం పై క్లారిటీ ఇచ్చింది లేదు. కానీ మొదటిసారి తన విడాకుల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని క్లారిటీ ఇచ్చింది ఆమని. ఆమని ఈ విషయంపై స్పందిస్తూ.. ‘‘నేను సినీ పరిశ్రమలో రాణించాలని అనుకునేదాన్ని.

పెళ్ళైనప్పటికీ నాకు సినిమాల పై ఇంట్రెస్ట్ తప్పలేదు. మరోపక్క ఆయన వ్యాపారాల్లో బిజీగా ఉండేవారు. దీంతో ఒకరి కోసం ఇంకొకరం టైం కేటాయించుకోవడం బాగా కష్టంగా ఉండేది. అందుకే పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నాం. ఫ్రెండ్లీగానే విడిపోయాం. ఎవ్వరినీ తప్పు పట్టేంతగా ఏమీ జరగలేదు. మా మధ్య గొడవలు వంటివి కూడా ఏం లేవు.

విడాకులు తీసుకున్నా ఇప్పటికీ మేము కలుస్తూనే ఉన్నాం. విడాకుల తర్వాత..మా పిల్లల బాధ్యత నేనే తీసుకోవడం జరిగింది. నా ప్రపంచం వాళ్ళే. వరుస సినిమాల వల్ల పిల్లలతో ఎక్కువ టైం గడపలేకపోతున్నాను. అదే నన్ను ఇబ్బంది పెడుతున్న సమస్య’’ అంటూ చెప్పుకొచ్చారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus