అల్లు అర్జున్ (Allu Arjun) ‘పుష్ప 2’ (Pushapa 2) కోసం ఆల్మోస్ట్ 3 ఏళ్ళు కేటాయించాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ (Trivikram) తో సినిమా ప్రకటించాడు. త్రివిక్రమ్ సినిమా అంటే ఫాస్ట్ గా అయిపోతుంది అని అంతా ఆశించారు. సాధారణంగా త్రివిక్రమ్.. మహేష్ బాబుతో (Mahesh Babu) తప్ప మిగిలిన హీరోలతో ఆలస్యంగా సినిమాలు చేసింది లేదు. దాదాపు 9 నెలల్లో సినిమాని కంప్లీట్ చేసేస్తాడు. నిజమే.. ఫ్యామిలీ సబ్జెక్ట్..లు అయితే త్రివిక్రమ్ అలాగే లాంగిచేసేవాడు. కానీ ఇప్పుడు అతను కూడా పాన్ ఇండియా బాట పట్టాడు.
అందుకోసం మైథాలజీ సబ్జెక్ట్ ఎంపిక చేసుకున్నాడు. ఇది త్రివిక్రమ్..కి చాలా కొత్త. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు తీయాలంటే.. టెక్నాలజీని బాగా అర్థం చేసుకోవాలి. అందుకే ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD) లాంటి సినిమాని నాగ్ అశ్విన్ (Nag Ashwin) తక్కువ టైంలో తీయగలిగాడు. త్రివిక్రమ్ ఇప్పటివరకు పెన్ పైనే ఆధారపడ్డాడు. టెక్నికల్ గా త్రివిక్రమ్ వీక్.ఈ విషయంలో డిబేట్ లేదు. అందుకోసం కథ మొత్తం రెడీ చేసినా.. టైం తీసుకుంటున్నాడు. విజువల్ గా వండర్స్ క్రియేట్ చేయడం అటుంచితే..
సరైన మీటర్లలో కెమెరాలు పెట్టకపోతే.. వి.ఎఫ్.ఎక్స్ కి డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతుంది. అప్పుడు బడ్జెట్ కూడా పెరిగిపోతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే త్రివిక్రమ్ టైం తీసుకుంటున్నాడు. అతన్ని నిర్మాతలు కంగారు పెట్టరు. ఎటొచ్చి బన్నీ నుండే ఇబ్బంది. అతను ఇప్పుడు తొందరగా సినిమాలు చేయాలని చూస్తున్నాడు. త్రివిక్రమ్ కనుక ఆలస్యం చేస్తే.. అతనికి మరో రెండు ఆప్షన్లు ఉన్నాయి.
ఒకటి అట్లీ(Atlee Kumar), ఇంకోటి సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). ప్రభాస్ తో (Prabhas)… సందీప్ ‘స్పిరిట్’ (Spirit) చేసే పనిలో ఉన్నాడు కాబట్టి.. అతనితో బన్నీ ఇప్పుడు చేయడం కష్టం. ఇక అట్లీ అయితే అల్లు అర్జున్ తో సినిమా చేయాలని చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నాడు. బన్నీ కూడా అట్లీతో సినిమా చేయడానికి రెడీ. కాకపోతే ‘పుష్ప 2’ అయ్యాక త్రివిక్రమ్ తో సినిమా కరెక్ట్ అనుకున్నాడు. త్రివిక్రమ్ మరింతగా ఆలస్యం చేస్తే.. అట్లీతో బన్నీ ముందుకు వెళ్లే అవకాశాలు కూడా లేకపోలేదు.