LEO: లియో అడియో ఫంక్షన్ రద్దుకు కారణం ఇదేనా..!

దర్శకుడు లోకేష్ కనగరాజ్ , తమిళ సూపర్ స్టార్, తలపతి విజయ్ తో ‘లియో’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అక్టోబర్ 19న విడుదలవుతోంది. ఈ సినిమా కోసమని విజయ్ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే ఈ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ కోసం కూడా అభిమానులు చాలా కాలం నుండి ఎప్పుడప్పుడా అని ఎదురుచూస్తూ, విజయ్ స్పీచ్ కోసం, అతను ఏమి చెప్తాడా వినాలని కుతూహలంతో వున్నారు.

అయితే ఇప్పుడు ఈ ఆడియో ఫంక్షన్ జరపటం లేదని, కొన్ని అనివార్య కారణాల వలన రద్దు చేశామని ఈ సినిమా నిర్మిస్తున్న ప్రొడక్షన్ సంస్థ సాంఘీక మాధ్యమం ట్విట్టర్ లో ప్రకటించింది. “ఈ చిత్ర ఆడియో ఫంక్షన్ కి విజయ్ అభిమానులు చాలామంది వచ్చే అవకాశం వుంది, అలాగే అందరికీ ఎంట్రీ పాస్ లు ఇవ్వడం కుదరకపోవచ్చు.

ఇంతమంది అభిమానులు రావటం వలన, భద్రతా కారణాల దృష్ట్యా ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్ రద్దు చెయ్యాలని అనుకున్నాం” అని ఆ చిత్ర నిర్మాతలు సెవెన్ స్క్రీన్ స్టూడియో ట్వీట్ చేసింది. అలాగే ఇంకొక లైన్ కూడా దీనికి జతపరుస్తూ ఈ ఫంక్షన్ రద్దు చెయ్యటం వెనుక ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేదని స్పష్టం చేసింది. అయితే సినిమా గురించి అన్ని సమాచారాలు అభిమానులకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటామని చెప్పింది.

అలాగే చాలామంది అభిమానులు విజయ్ స్పీచ్ మిస్ అయ్యాం అని ఈ ట్వీట్ కి సమాధానంగా పెడుతున్నారు. అలాగే విజయ్ తో మేముంటాం, #WeStandWithLEO వియ్ స్టాండ్ విత్ (LEO) లియో అనే హేష్ టాగ్ లు కూడా జతపరిచి విజయ్ అభిమానులు ట్వీట్ చేస్తున్నారు.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus