Narappa: చిరు ఆ విషయంలో పట్టుదలతో ఉన్నారా..?

స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా మే నెల 13వ తేదీన విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజైన ఒకరోజు తరువాత నారప్ప సినిమా విడుదల కావాల్సి ఉంది. ఆచార్య, నారప్ప సినిమాలలో ఒక సినిమా విడుదల వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నా ఏ సినిమా వాయిదా పడుతుందో తెలియడం లేదు. ఆచార్య రిలీజ్ డేట్ వాయిదాకు సంబంధించి వార్తలు వస్తున్నా చిరంజీవి రిలీజ్ డేట్ విషయంలో పట్టుదలతో ఉన్నారని తెలుస్తోంది.

ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనైనా మే 13వ తేదీనే రిలీజ్ చేయాలని భావిస్తున్నారని సమాచారం. మరోవైపు ఆచార్య ప్రమోషన్స్ వేగంగా జరుగుతుంటే నారప్ప చిత్రయూనిట్ మాత్రం సైలెంట్ గా ఉంది. ప్రేక్షకుల్లో నారప్ప సినిమాపై అంచనాలు మరింత పెంచేలా ప్రయత్నాలు జరగాల్సి ఉంది. నారప్ప సినిమా పాటలు, ట్రైలర్ రిలీజ్ డేట్ కు సంబంధించిన ప్రకటనలు వెలువడాల్సి ఉంది. నారప్ప సినిమా నుంచి ఇప్పటివరకు ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ కాగా ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ఇవ్వాలని వెంకటేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.

నారప్ప చిత్రయూనిట్ రిలీజ్ డేట్ విషయంలో స్పష్టత వచ్చిన తరువాతే పబ్లిసిటీ కార్యక్రమాలను మొదలు పెడదామని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. నారప్ప రిలీజ్ డేట్ మారినా వెంకటేష్ కు ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు. దృశ్యం 2 సినిమా జూన్ 20వ తేదీన రిలీజ్ కానుండగా ఎఫ్3 సినిమా ఆగష్టు 27న రిలీజ్ కానుంది. షార్ట్ గ్యాప్ లో వెంకటేష్ సినిమాలు రిలీజ్ అవుతుండటంతో నారప్ప సినిమా రిలీజ్ డేట్ మారితే ఆ ప్రభావం ఇతర సినిమాలపై కూడా పడే అవకాశం ఉంది.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus