బిగ్ బాస్ హౌస్ లో బాల్స్ గేమ్ అనేది రచ్చ లేపుతోంది. మొదటి రౌండ్ లో శోభాశెట్టికి ఇంకా యావర్ కి అయిన గొడవతో మొదలైన ఈ టాస్క్ ఇప్పుడు శివాజీకి ఇంకా శోభాశెట్టికి మద్యలో కూడా పెద్ద గొడవని పెట్టింది. బాల్స్ కొట్టే విషయంలో అమర్ ఇంకా పల్లవి ప్రశాంత్ ఇద్దరూ కలిసి పెద్ద గొడవ పడ్డారు. ఆ రౌండ్ లో ఇద్దరూ కూడా రెడ్ లైన్ దాటి మరీ ముందుకు వచ్చేశారు. అయితే, సంచాలక్ గా ఉన్న యావర్ మాత్రం అమర్ అవుట్ అయ్యాడని చెప్పాడు.
కానీ, శోభా మాత్రం పల్లవి ప్రశాంత్ కూడా అవుట్ అయినట్లే అని వాదన పెట్టుకుంది. ఇక్కడే శివాజీ ఇన్వాల్ అయ్యాడు. శోభాకి ఎక్స్ ప్లయిన్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ, శోభా ఎక్కడా తగ్గలేదు. శివాజీకి మాటకి మాట ఇచ్చిపారేసింది. మెల్లగా చెప్తున్నా కూడా శివాజీపై విరుచుపడింది. మాటకి మాట చెప్తూ రెచ్చగొట్టింది. దీంతో శివాజీ కూడా వాదనకి దిగాడు. ఫ్యూచర్ లో ఇలా ఉంటే బాధపడతావ్ అన్నాడు. నా ఫ్యూచర్ గురించి మీకు బెంగ అక్కర్లేదు., మా పేరెంట్స్ చూసుకుంటారంటూ వెటకారం చేసింది.
శోభాశెట్టి రెచ్చిపోయి మరీ ఆర్గ్యూమెంట్ చేసింది. కెమెరాల ముందు మీకంటే ఎవరూ బాగా యాక్టింగ్ చేయలేరని, అసలు కెమెరా మాట ఎత్తిందే మీరే అని చెప్పి వాదన పెట్టుకుంది. మీరు ఫస్ట్ నుంచీ ఇలాగే ఉన్నారంటూ వెటకారంగా మాట్లాడింది. దీంతో శివాజీ మాటకి మాట చెప్పాడు. అంతేకాదు, ఆ తర్వాత గేమ్ లో కంటిన్యూ అవుతూ ప్రియాంకపై బాల్స్ విసురుతూ ఎటాక్ చేస్తుంటే ప్రియాంకకి సపోర్ట్ గా శోభా ఎంకరేజ్ చేసింది. ఇది కూడా శివాజీకి నచ్చలేదు. సంచాలక్ గా ఉన్నప్పుడు సరిగ్గా ఉండాలంటూ, గేమ్ లో (Bigg Boss 7 Telugu) నుంచీ బయటకి వచ్చేశాడు.
దీంతో ఇద్దరికీ పెద్ద ఘర్షణ అయ్యింది. పద్దాక, ప్రియాంక ప్రియాంక అంటుంటే మేమేం పీకడానికి ఇక్కడ అంటూ శివాజీ ఫుల్ ఫైర్ అయ్యాడు. సంచాలక్ గా ఉన్నప్పుడు నేను ఎవరికైనా సరే సపోర్ట్ చేస్తా నా ఇష్టం అంటూ శోభా వాదన పెట్టుకుంది. అందుకే, నాకు అది నచ్చలేదు గేమ్ నుంచీ బయటకి వచ్చానని శివాజీ చెప్పాడు. అమర్ కి పల్లవి ప్రశాంత్ కి అలాగే శోభాకి యావర్ కి గొడవలు అయిన తర్వాత ఈ టాస్క్ ఆడే ఉత్సాహం అనేది పార్టిసిపెంట్స్ లో పోయింది.
అందుకే, శివాజీ బయటకి వచ్చేశాడు. ఇక ఈ బాల్స్ గేమ్ లో అర్జున్ విన్నర్ గా నిలిచాడు. ఓట్ అప్పీల్ కోసం కంటెండర్ అయ్యాడు. మొత్తానికి ఈ బాల్స్ గేమ్ అనేది హౌస్ లో విద్వసం సృష్టించింది. అప్పటి వరకూ బాగా ఆడిన పార్టిసిపెంట్స్, స్పై బ్యాచ్ వర్సెస్ స్పా బ్యాచ్ గా ఉన్న పార్టిసిపెంట్స్ ఇప్పుడు ఓపెన్ అయి ఎవరిది వాళ్లే రైట్ అనుకుంటూ అరుచుకున్నారు. మరి దీనిపైన వీకెండ్ నాగార్జున ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరం.
హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!