26 ఏళ్ళ ‘యమజాతకుడు’ సినిమా ఫలితం వెనుక మెయిన్ రీజన్ అదే..!

సీనియర్ ఎన్టీఆర్ (NTR) ‘యమగోల’ నుండి యముడు బ్యాక్ డ్రాప్లో వచ్చే ఫాంటసీ సినిమాలకి మంచి డిమాండ్ ఉండేది. ఈ కోవలో వచ్చిన చిరంజీవి (Chiranjeevi) ‘యముడికి మొగుడు’, అలీ (Ali) ‘యమలీల’ వంటివి సూపర్ హిట్లు అయ్యాయి. సో యముడు, యమలోకం బ్యాక్ డ్రాప్లో వచ్చే సినిమాలు మినిమమ్ గ్యారంటీ అని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. అయితే ఇదే క్రమంలో అంటే 1999వ సంవత్సరంలో మార్చి 5న ‘యమజాతకుడు’ (Yamajathakudu) అనే సినిమా వచ్చింది.

Yamajathakudu

నేటితో 26 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. దీనిపై మొదట మంచి అంచనాలే ఏర్పడ్డాయి. కచ్చితంగా ఈ సినిమా మోహన్ బాబుకు (Mohan Babu) మంచి హిట్ ఇస్తుంది అని అంతా అనుకున్నారు. సాక్షి శివానంద్ (Sakshi Shivanand) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని స్వయంగా మోహన్ బాబు నిర్మించడం జరిగింది. పరుచూరి బ్రదర్స్ (Paruchuri Venkateswara Rao , Paruchuri Gopala Krishna) కథ అందించడం జరిగింది. ఇన్ని స్పెషాలిటీస్ ఉన్న ఈ సినిమా కచ్చితంగా హిట్టు కొట్టాలి. కానీ చతికిలపడింది. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి డైరెక్షన్ అని చెప్పాలి.

ఎందుకంటే ఈ సినిమాకి ఎన్.శంకర్ ని (N. Shankar) దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు. ఆయన అతని కెరీర్లో ఎక్కువగా ‘శ్రీరాములయ్య’ ‘జయం మనదేరా’ (Jayam Manadera) వంటి విప్లవాత్మక సినిమాలే చేశాడు. ఆయనకు శైలికి పూర్తిగా భిన్నమైన జోనర్ ఇది. సో ఈ కథని ఆయన సరిగ్గా ఓన్ చేసుకోలేకపోయారు అని చెప్పాలి. అలాగే ఈ సినిమాలో (Yamajathakudu) యముడి పాత్రలో రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) నటించాడు. ఆయనకు కూడా ఈ రోల్ అస్సలు సెట్ కాలేదు. యముడితో కామెడీ చేయించాలి అనే ఒక్క ఉద్దేశంతోనే అతన్ని పెట్టినట్లు ఉన్నారు.

అది కూడా ఆడియన్స్ కి చిరాకు తెప్పించింది. ఇక క్లైమాక్స్ కూడా ప్రేక్షకుల సహనానికి పెద్ద పరీక్ష పెట్టినట్టు అయ్యింది. వందేమాతరం శ్రీనివాస్ (Vandemataram Srinivas) సంగీతం కూడా దీనికి సెట్ అవ్వలేదు. ఇలా ఈ సినిమాలో చాలా మైనస్సులు ఉన్నాయి. అందుకే దర్శకుడికి ఉన్న స్ట్రెంత్ ను బట్టి.. వాళ్ళకి కథలు ఇవ్వాలి అని ఈ సినిమా ప్రూవ్ చేసింది. అందుకే ‘యమదొంగ’ (Yamadonga) లో యముడిగా మోహన్ బాబు సక్సెస్ అయ్యారు కానీ.. ‘యమజాతకుడు’ గా మాత్రం సక్సెస్ కాలేకపోయారు అని చెప్పాలి.

32 ఏళ్ళ క్రితం వచ్చిన రాజశేఖర్ సినిమా విషయంలో అంత జరిగిందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus