‘మర్మయోగి’ ఆగిపోవడానికి అసలు కారణం అదే..!

కమల్ హాసన్- వెంకటేష్ ల కాంబినేషన్లో ‘ఈనాడు’ అనే సినిమా వచ్చింది. కమర్షియల్ గా ఈ చిత్రం పెద్దగా వర్కౌట్ కాకపోయినా కమల్, వెంకటేష్ ల ఫ్యాన్స్ ను బాగానే ఆకట్టుకుంది. ఈ స్టార్స్ అటెంప్ట్ కు కూడా విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రంలో కమల్, వెంకీ కాంబినేషనల్ సీన్ ఒకటి మాత్రమే ఉంటుంది. దాంతో ఫ్యాన్స్ కొంచెం నిరాశచెందారు. అయితే ఈ చిత్రానికి ముందే కమల్, వెంకీ లు కలిసి ‘మర్మయోగి’ అనే చిత్రంలో నటించాలి అనుకున్నారు. ఆ చిత్రంలో ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఓ రేంజ్లో ఉంటాయని అప్పట్లో కమల్ చెప్పారు. ‘వెంకటేష్ చాలా ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి..

అతనితో ‘మర్మయోగి’ చిత్రంలో కలిసి నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను’ అంటూ కమల్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. అయితే ఈ చిత్రం పట్టాలెక్కలేదు. వెంకటేష్ ఈ చిత్రం షూటింగ్ కోసం 60రోజుల కాల్షీట్లు ఇచ్చారట. కమల్ హాసనే ఈ చిత్రానికి దర్శకుడు. అంతేకాదు కథ కూడా అతనిదే..! సహా నిర్మాతగా కూడా వ్యవహరించడానికి ముందుకొచ్చాడు కమల్. అయితే ఈ చిత్రానికి అనుకున్నదానికంటే ఎక్కువ బడ్జెట్ అయిపోతుందట. ‘పూర్తి ఎస్టిమేషన్ వెయ్యకుండానే భారీ బడ్జెట్ అవుతుందని.. కాబట్టి స్క్రిప్ట్ ను మళ్ళీ పరిశీలించి.. ప్రీ ప్రొడక్షన్ పనులు 6నెలల పాటు జరపాలనే ఉద్దేశంతో’ అప్పట్లో ఈ ప్రాజెక్టుని హోల్డ్ లో పెట్టినట్టు సమాచారం.

ఈ చిత్రం కోసం హేమా మాలిని, త్రిష, శ్రియ, శోభన వంటి హీరోయిన్లను ఎంపిక చేసుకున్నారట. అంతేకాదు ముమైత్ ఖాన్ ను కూడా ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నారట. ఈ ప్రాజెక్టు లేట్ అవుతుంది అని భావించి త్రిష, శ్రియ లు ముందుగానే తప్పుకున్నారట. ఇదిలా ఉండగా.. కమల్ మాత్రం ‘ఈ ప్రాజెక్టుని కచ్చితంగా తెరకెక్కిస్తాను’ అని అప్పట్లో చెప్పారు కానీ.. ‘ఇండియన్2’ తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నట్టు తెలిపారు కాబట్టి ఈ ప్రాజెక్టు ఇక ఉండదు అని అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ లోకేష్ కనగరాజన్ డైరెక్షన్లో సినిమా చెయ్యడానికి కమల్ అంగీకరించారు కాబట్టి.. ‘మర్మయోగి’ పై కూడా దృష్టి పెడతారేమో చూడాలి.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus