Actress Poorna: పూర్ణ మొబైల్‌ వాల్‌పేపర్‌గా ఆ స్టార్‌ హీరో

షమ్నా కాసిమ్‌ అంటే చాలామంది తెలియకపోవచ్చు. పూర్ణ అంటే మాత్రం చాలామందికి తెలుసు. సినిమాల్లో నటిగా పరిచయం ఉన్న పూర్ణ… వెబ్‌ సిరీస్‌లు, టీవీ షోలతో ఇంకాస్త పరిచయమైంది. టీవీ షోకి జడ్జిగా వచ్చాక ఇంకా ఎక్కువ పరిచయమైంది. ఇదంతా ఓకే. అసలు షమ్నా కాసిమ్‌… పూర్ణగా ఎలా మారింది. ఎందుకు మారింది అనే విషయం తెలుసా? దీని కోసం ఓ సారి పూర్ణ దగ్గర ప్రస్తావిస్తే ఇలా చెప్పుకొచ్చింది. ..

షమ్నా కాసిమ్‌గానే పూర్ణ ఇండస్ట్రీలోకి వచ్చింది. అలా వచ్చిన కొత్తలో తమిళంలో ఓ సినిమా చేసింది. ఆ చిత్ర బృందానికి ఆమె పేరు పలకడం కష్టంగా ఉండేదట. దీంతో ఆ సినిమా దర్శకుడు…పేరు మార్చుకోమని సూచించారట. దాంతో చాలా పేర్లు వెతికీ వెతికీ ఏదీ నచ్చక ఆగిపోయిందట. ఆ సమయంలోనే ఆమె మేనేజర్‌కు పాప పుట్టిందట. ఆ బిడ్డకు పూర్ణ అని పేరు పెట్టారట. ఆ పేరు నచ్చడంతో షమ్నా కాసిమ్‌ తన పేరును పూర్ణగా మార్చుకుందట. అలా మేనేజర్‌ కూతురు పేరే ఆమె పేరు అయ్యింది.

పూర్ణ… షమ్నాగా ఉన్న రోజుల్లో అంటే చిన్నతనంలో రోజూ స్కూల్‌కి వెళ్లే మార్గంలో అబ్బాయిల స్కూల్‌ ఉండేదట. వ్యాన్‌లో వెళ్తున్నప్పుడు ఓ అబ్బాయి స్కూలు బయట నిల్చొని ఆమెను చూసేవాడట. అలా ఏడాదిపాటు ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారట. చివరకు ప్రేమికుల రోజున షమ్నా దగ్గరకు వచ్చి గులాబీలూ, చాక్లెట్లూ ఇచ్చి… ఐలవ్‌యూ చెప్పేశాడట. కానీ ఏమైందో కానీ ఆ తర్వాత అతను కనిపించలేదు అని చెప్పింది పూర్ణ. పూర్ణ మంచి ఫుడీ. నియమాలేం పెట్టుకోకుండా అన్నీ ఇష్టంగా తింటుంది. స్వీట్లు ఉన్నాయంటే అస్సలు ఆగలేదట పూర్ణ.

అలాగే రోజుకో చాక్లెట్‌ తింటుందట. అయితే ఫిట్‌నెస్‌ కోసం రోజూ కసరత్తులు చేసే అలవాటు లేదట. కేవలం డ్యాన్స్‌ చేస్తుందంతే. సల్మాన్‌ఖాన్‌ అంటే పూర్ణకు చాలా ఇష్టమే. చిన్నప్పటి నుంచి సల్మాన్‌ను పెళ్లి చేసుకోవాలని అనుకునేదట. ఒక్కసారైనా దగ్గరనుంచి చూసే అవకాశం కోసం ఎదురుచూస్తోందట. తెలుగులో అయితే విజయ్‌ దేవరకొండ, ప్రభాస్‌ అంటే ఇష్టమట. ఇక ‘అఖండ’ సినిమా షూట్‌లో బాలకృష్ణ ఎనర్జీ చూసి… అంత ఎనర్జిటిక్‌ ఉండాలని అనుకుందట పూర్ణ. అందుకే అప్పుడప్పుడూ ఆయన ఫొటోను మొబైల్‌ వాల్‌పేపర్‌గా పెట్టుకుంటా అని చెప్పింది. ఆయన ఫొటో చూడగానే కొత్త ఉత్సాహం వస్తుందట.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus