అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం తన కెరీర్ ను మరో రేంజ్ కు తీసుకు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడు. పుష్ప 2 (Pushpa 2: The Rule) గ్రాండ్ సక్సెస్ తర్వాత తను సినిమాల విషయంగా మరో మెట్టుపైకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడంతో పాటు, బన్నీ ఫాలోయింగ్‌ను విపరీతంగా పెంచేసింది. కానీ, ఇంతటి విజయం తర్వాత విదేశాలకు వెళ్లడం అందరిలోనూ అనేక ప్రశ్నలు రేకెత్తించింది. అందుకు అసలు కారణం, ఈసారి బన్నీ మరింత ప్రిపరేషన్‌తో మళ్లీ తెరపై దూసుకెళ్లాలనే ప్లాన్ చేస్తున్నాడట.
తన కెరీర్‌కు కొత్త మోడ్ పెట్టాలనే ఉద్దేశంతోనే బన్నీ ఈ ట్రిప్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఫిట్‌నెస్, యాక్టింగ్, మైండ్‌ఫుల్‌నెస్ వంటి అంశాల్లో మరింత ప్రొఫెషనల్‌గా ఉండటానికి ఆయన కొన్ని స్పెషల్ కోర్సులు చేస్తున్నట్లు టాక్. ముఖ్యంగా యూరప్‌లో ఓ ప్రఖ్యాత వెల్నెస్ సెంటర్‌లో మెడిటేషన్, మానసిక స్థైర్యాన్ని పెంపొందించే టెక్నిక్స్ నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఫిజికల్ ట్రైనింగ్‌లో ఎప్పుడూ ముందుండే బన్నీ, ఈసారి మెంటల్ ప్రిపరేషన్‌పై దృష్టిపెట్టడం ఆసక్తికరంగా మారింది.
ఇదే కాకుండా, తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌లకు ముందుగా పూర్తిగా సిద్ధంగా ఉండటానికే ఈ శిక్షణ. పుష్ప రాజ్ లుక్ కోసం రెండేళ్లుగా ఒకే తరహాలో ఉండాల్సి వచ్చిన బన్నీ, కొత్త సినిమాలకు పూర్తిగా ఫ్రెష్‌గా మారే ప్రయత్నం చేస్తున్నాడట. మరోవైపు, ఇటీవల సంధ్య థియేటర్, కోర్టు కేసుల వ్యవహారాలతో మానసిక ఒత్తిడికి గురైన ఆయన, అందులో నుంచి బయటపడే ప్రయత్నంగా కూడా ఈ ట్రిప్ ప్లాన్ చేసుకుని ఉంటాడనే ఊహాగానాలు ఉన్నాయి.
ప్రస్తుతం త్రివిక్రమ్ (Trivikram) , అట్లీ (Atlee Kumar) లాంటి డైరెక్టర్లతో సినిమా చర్చలు జరుపుతున్న బన్నీ, ఏ ప్రాజెక్ట్ ముందుగా స్టార్ట్ చేస్తాడనే విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కానీ, 2026 నాటికి రెండు సినిమాలు కంప్లీట్ చేసేలా షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నట్లు టాక్. అంతర్జాతీయంగా తన క్రేజ్ పెంచుకోవాలని చూస్తున్న అల్లు అర్జున్, హాలీవుడ్ స్టయిల్లో ప్రిపరేషన్ మొదలుపెట్టినట్లు ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ ట్రిప్ వల్ల బన్నీ ఎలాంటి మార్పులతో వస్తాడన్నది ఆసక్తిగా మారింది.