Nani: నాని తదుపరి టార్గెట్.. అగ్ర హీరోల లిస్టులో చేరతాడా?

నేచురల్ స్టార్ నాని (Nani)  గత కొంతకాలంగా వరుస విజయాలతో తన మార్కెట్‌ను పెంచుకుంటూ వస్తున్నాడు. దసరా (Dasara), సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram)  వంటి సినిమాలు వంద కోట్ల క్లబ్‌లో చేరడంతో, అతని రేంజ్ ఇంకాస్త పెరిగింది. స్టార్ డైరెక్టర్స్ సపోర్ట్ లేకుండా టాలెంటెడ్ ఫ్రెష్ డైరెక్టర్స్‌తో ప్రయోగాలు చేస్తూ నాని ముందుకు వెళ్లడం గమనార్హం. అయితే, ఇప్పుడు అతని నెక్ట్స్ టార్గెట్ పెద్ద లెవెల్‌కి వెళ్లాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్‌లో ‘టైర్-1’ హీరోల జాబితాలో చేరాలంటే 300 నుంచి 500 కోట్ల రేంజ్ లో వసూళ్లు రాబట్టే స్థాయిలో సినిమాలు ఉండాలి.

Nani

పుష్ప (Pushpa), RRR, బాహుబలి (Baahubali) లాంటి సినిమాలు అలా బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. నాని ఇప్పటి వరకు క్లాస్, ఫ్యామిలీ ఆడియెన్స్‌తో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. కానీ దసరా సినిమా అతన్ని మాస్ హీరోగా కొత్త లెవెల్‌కి తీసుకెళ్లింది. ఇప్పుడు ది ప్యారడైజ్ టీజర్ రిలీజయ్యాక, అది అతని కెరీర్‌లో మోస్ట్ ఇంటెన్స్ యాక్షన్ మూవీగా నిలిచే అవకాశముందని అంచనాలు పెరిగాయి. ఇంకా హిట్ 3  (HIT3) కూడా అదే రేంజ్‌లో ఉంటుందనే టాక్ నడుస్తోంది.

ఒకవేళ ఈ రెండు సినిమాలు బిగ్ రేంజ్ లో సక్సెస్ అయితే, నాని సూపర్ స్టార్ లెవెల్‌కి వెళ్లే అవకాశముంది. కానీ ఇది అంత ఈజీ కాదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు నాని సినిమాలు 100 కోట్ల మార్క్‌ను దాటినప్పటికీ, 150 కోట్లు కూడా రీచ్ కాలేదు. ముందు 200 కోట్ల మార్క్‌ను అందుకోవాలి. ఆ తర్వాతే పాన్ ఇండియా హీరోగా అతని లెవెల్ అప్ అవుతుందా అనే విషయం స్పష్టమవుతుంది.

అంతేకాదు, నాని మార్కెట్ పెరగాలంటే హిందీ ఆడియెన్స్‌ను టార్గెట్ చేయాల్సిన అవసరం ఉంది. పుష్ప లాంటి క్రేజ్ రావాలంటే, కంటెంట్ హై రేంజ్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. ది ప్యారడైజ్ (The Paradise), హిట్ 3 సినిమాలు హిందీ మార్కెట్‌లో గట్టిగా హిట్ అయితే, నాని ఖచ్చితంగా 300 కోట్ల మార్క్‌ను అందుకునే స్థాయికి చేరతాడు.

ఇప్పటివరకు టాప్ హీరోలతో పోలిస్తే నాని కంటెంట్ బేస్డ్ హీరోగా ఉండటం అతనికి బలంగా మారింది. కానీ అగ్ర హీరోల లీగ్‌లో నిలవాలంటే కేవలం కథలు కాదు, భారీ బడ్జెట్, ఇంటెన్స్ ప్రమోషన్స్, పాన్ ఇండియా ఎఫెక్ట్ అవసరం. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తే, నాని ఖచ్చితంగా టైర్-1 హీరోగా మారతాడని ఫిలిం వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus